Chinta Mohan: జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. జమిలితో చంద్రబాబుకే నష్టం..!
- చంద్రబాబు, వైఎస్ జగన్‌పై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు..
- జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు..
- మళ్లీ జగన్ బలపడే అవకాశం లేదని వ్యాఖ్య..
- జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు ఒప్పుకోరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chinta Mohan: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు.. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్.. గుంటూరులో మీడియాలో మాట్లాడిన ఆయన.. జగన్ ఒక్క ఛాన్స్ మాత్రమే అడిగారు.. రెండో ఛాన్స్ లేదు.. అడిగినా ప్రజలు అవకాశం ఇవ్వరు అని పేర్కొన్నారు.. మళ్లీ ఏపీలో జగన్ బలపడే అవకాశం లేదని జోస్యం చెప్పారు.. ఇక, జమిలి వస్తే చంద్రబాబుకు నష్టం.. అందుకే జమిలి ఎన్నికలకు చంద్రబాబు ఒప్పుకోరని పేర్కొన్నారు.. జమిలి ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదన్నారు చింతా మోహన్.. ఇక, కాంగ్రెస్ నాయకులు ప్రజల్లో తిరగడంలేదు.. హైదారాబాద్ లో కూర్చుంటే పనులు జరగడం లేదు.. ప్రస్తువం ఈవీఎంల మేనేజ్‌మెంట్ జరుగుతోంది.. గెలవాలి అంటే ప్రజల్లోకి వెళ్లి కష్టపడాలని సూచించారు..
Read Also: Goshamahal Tension: గోషామహల్ బంద్కు స్థానికులు, వ్యాపారులు పిలుపు..
Also Read
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
మరోవైపు.. దళితులపై వివక్ష, అంటరానితనం ఎలా ఉంటుందో కళ్లారా చూసిన వ్యక్తిని నేను అన్నారు చింతా మోహన్.. ఒకప్పుడు దళితుల నాడి పట్టుకుని వైద్యం చేయడానికి కూడా వెనకాడేవారని పేర్కొన్న ఆయన.. మూతికి ముంత, వెనుక తాటాకు కట్టుకుని తిరిగిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అంటరాని తనం రూపు మాపాలని గాంధీకి నెహ్రూకు చెప్పారు.. రాజ్యాంగంలో ఎస్సీలకు 15 శాతం ఇచ్చిన ఘనత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కిచ, కాంగ్రెస్ నాయకులకు దక్కిందన్నారు.. అయితే, ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయి.. పక్క రాష్ట్రాల్లో అమలు చేయలేని వర్గీకరణను ఏపీలో చంద్రబాబు అమలు చేయాలని చేస్తున్నారు.. ఏకసభ్య కమిటీ పేరుతో చేస్తున్న ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు.. చంద్రబాబుకి దళితుల చేసిన అన్యాయం ఏంటి…? అని నిలదీశారు. దళితులను ఎందుకు విభజించాలని చూస్తున్నారు.. తిరుపతిలో పెట్టాల్సి న రాజధాని విజయవాడలో పెడితే రాయల సీమ ప్రాంతం ఏం అవ్వాలి? అని ప్రశ్నించారు.. రాయల సీమ వాళ్లు బయట పడటం లేదు.. కానీ, ఉడికి పోతున్నారని పేర్కొన్నారు..
Read Also: Whatsapp Update: వాట్సాప్ వినియోగదారుల కోసం సరికొత్త ఫోన్ కాల్ డయలర్ ఫీచర్
ఇక, A అంటే అమరావతి P అంటే పోలవరం అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయాలని సలహా ఇచ్చారు చింతామోహన్.. ఒక్కో జిల్లా అభివృద్ధికి 5 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. 60 వేల కోట్లు ఒక్క చోటే పెట్టాల్సి న అవసరం లేదన్నారు. వర్గీకరణ ఉద్యోగాలలో జరగాలి… ఎస్సీ కాంట్రాక్టర్ లకు అవకాశాలు ఇవ్వాలి.. బ్యాంక్ ఉద్యోగాలలో ఎస్సీలకు అవకాశాలు ఇవ్వాలని కోరారు.. నేను వర్గీకరణ కు వ్యతిరేకం.. వర్గీకరణ చేస్తే టీడీపీ పతనం అవుతుందని జోస్యం చెప్పారు.. వైసీపీ విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టి మంచి పని చేసిందని ప్రశంసలు కురిపించారు.. అయితే, కర్నూలులో హై కోర్టు బెంచ్ వల్ల ప్రయోజనం లేదు… రాయలసీమ ప్రాంతంలో ఉపాధి కావాలని కోరారు మాజీ ఎంపీ చింతా మోహన్..
తాజావార్తలు
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్‌పై బీజేపీ సెటైర్లు..
-
Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
-
Danam Nagender : దానం నాగేందర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు అప్పీల్
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!