Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక పోతున్నామని చెప్పేశారని తెలిపారు. వైఎస్ జగన్ ఇంత విధ్వంసం చేశాడని చంద్రబాబు ఉహించలేదంట.. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు.. అందుకే సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసే వాగ్దానాలు అమలుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని.. అమలు చేయలేరని జగన్ ఎన్నికల ముందే చెప్పేశారని కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక అసలు నిజాలు చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి 2024 వరకు రాష్ట్రం అప్పు 6 లక్షల నలభై వేల కోట్లు మాత్రమే అని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Keeway k300 sf: ఈ బైక్‌పై రూ. 60 వేల డిస్కౌంట్.. రూ. 3 వేలతో బుక్ చేసుకోవచ్చు
ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశాడని, ఎన్నికల ముందు కూటమి నాయకులు చెప్పారు అని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు అబద్ధాలు చెప్పిన దానికన్నా, జగన్ తక్కువే అప్పులు చేశారు అన్నారు. అప్పులు ఉన్నా హామీలు అమలు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అలాగే, దావోస్ పర్యటన ఖర్చులు ఎంత?.. చేసుకున్న వ్యాపార ఒప్పందాలు ఎంత?.. దారి ఖర్చులకైనా పెట్టుబడులు వచ్చాయా?.. అని మాజీమంత్రి అంబటి ప్రశ్నించారు.
Read Also: Mallikarjun Kharge: గంగా నదిలో స్నానాలు చేస్తే పేదరికం పోతుందా.? ఇఫ్తార్ విందులో బీజేపీ రిప్లై..
అలాగే, రాష్ట్రానికి పెట్టుబడులు రానప్పుడు ఇంత ఖర్చు పెట్టీ ,చలిలో దావోస్ ఎందుకు వెళ్లారు? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. జగన్ కూడా దావోస్ వెళ్ళారు.. లక్ష కోట్లకు పైగా పెట్టు బడులు తెచ్చారు.. 60 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్ పెట్టడానికి ఒప్పందాలు చేసుకుని వచ్చారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముఖ్యమంత్రులు వాళ్ల రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చారు.. వాళ్ళనీ చూసి నేర్చుకోండి అని మాజీ మంత్రి అంబటి చెప్పుకొచ్చారు.