కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగి రెడ్డి మాత్రమే గెలిచారు.
పెద్దిరెడ్డికే కాదు జగన్ వాళ్ళు నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు అని నాగబాబు అన్నారు. పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఎవరు అయితే మాకెంటీ.. రాయలసీమలో 23 వేల ఎకరాలు దోచుకున్నారు.. తన అనుచరులతో పెద్దిరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్దం చేయించాడని ఆరోపించాడు.
విజయవాడ లోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని వైసీపీ నేతల బృందం కలిశారు.. ఏపీలో కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, వైఎస్ ఛైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు..
రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లకి వైసీపీ విప్ జారీ చేసింది. తెరచాటు రాజకీయాల నేపథ్యంలో విప్ జారీ చేసింది.. విప్ ధిక్కరిస్తే ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేయనుంది. రేపు పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
పార్టీ పదవులు పొందిన కార్యకర్తలందరికీ వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు.. పదవులు పొందిన వారందరూ పార్టీ గెలుపు కోసం పని చేయాలని కోరారు. పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు ఉంటాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. కరోనా సమయంలో ఇచ్చిన హామీలు చేసింది జగన్ మాత్రమే అన్నారు.. ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారన్నారు. ఎంఏ ఎకనామిక్స్, ఆర్థిక నిపుణుడు అయినా చంద్రబాబు ఇవన్నీ…
వైసీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఈనెల 5వ తేదీన వైసీపీ తలపెట్టిన ఫీజు పోరు ర్యాలీకి అనుమతివ్వాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. శాసన మండలి ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతివ్వాలని ఎన్నికల అధికారిని కోరారు.
టీడీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని.. పార్టీ ఫిరాయింపులను టీడీపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారన్నారని మండిపడ్డారు.
ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు.. ఇవాళ ఉదయం 10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్ లోనే ఉన్నారు..