YS Jagan: ముగిసిన లండన్ పర్యటన.. బెంగళూరుకు వైఎస్ జగన్
- లండన్ లో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన..
- ఈ నెల 14న లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు..
- తన కుమార్తె వర్షారెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్..
- ఇవాళ ఉ.10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరు చేరిక.. దాదాపు 15 రోజులకు పైగా లండన్ లోనే ఉన్న జగన్ దంపతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతితో కలిసి లండన్ పర్యటనకు వెళ్లిన విషయం విదితమే.. ఈ నెల 14వ తేదీన లండన్ వెళ్లిన వైఎస్ జగన్ దంపతులు.. ఇవాళ ఉదయం 10 గంటలకు లండన్ నుంచి బెంగుళూరుకు చేరుకున్నారు. దాదాపు 15 రోజులకు పైగా జగన్ లండన్ లోనే ఉన్నారు.. తన కుమార్తె వర్షా రెడ్డి డిగ్రీ ప్రధానోత్సవ కార్యక్రమానికి లండన్ వెళ్లిన జగన్.. ఇవాళ బెంగుళూరుకు తిరిగి వచ్చారు.. బెంగుళూరు కి చేరుకున్న జగన్ కు వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులు.. బెంగళూరు ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం పలికారు. ఇక, ప్రస్తుతం బెంగళూరులోనే బసచేయనున్న వైఎస్ జగన్.. ఫిబ్రవరి 3వ తేదీ తాడేపల్లిలోని ఆయన నివాసానికి వచ్చే అవకాశం ఉంది.. అనంతరం పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించనున్నారట వైఎస్ జగన్.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు.. పార్టీ నేతలపై కేసులు.. తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది..
Read Also: BRS Corporators Protest: జీహెచ్ఎంసీ ఆఫీసులో మరోసారి ఉద్రిక్తత.. మేయర్కి వ్యతిరేకంగా నినాదాలు
Also Read
- AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
- AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
- Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణుల ప్రశంసలు.. “ఇట్స్ వెరీ గుడ్.. గోయింగ్ ఆన్ వెరీ వెల్”
కాగా, లండన్ వెళ్లేందుకు వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతిచ్చిన విషయం విదితమే.. ఈ నెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జగన్ యూకే వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఆస్తుల కేసులో బెయిల్ మంజూరు చేసిన సమయంలో అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదనే షరతు కోర్టు విధించిన నేపథ్యంలో.. తన కూతురు గ్రాడ్యుయేషన్ డే కోసం లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు జగన్.. దీంతో.. జగన్ లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో.. కోర్టు ఇచ్చిన సమయంలోపే లండన్ వెళ్లివచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
Punganur Clashes: పుంగనూరు ఘటనపై మూడు కేసులు నమోదు.. డీఐజీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!