Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 29 01 2025

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :January 29, 2025 , 5:19 pm
By Gogikar Sai Krishna
  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్..
  • మీర్‌ పేట్‌ మర్డర్ కేస్.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్
  • కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు
  • భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్!

తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ను రిలీజ్ చేసింది. అయితే, ఫిబ్రవరి 3వ తేదీన వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగబోతుంది.. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుంది. ఇక, మార్చి 29వ తేదీతో మెదక్ – నిజామాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం ముగియనుంది.

కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది..

ప్రయాగరాజ్ కుంభమేళాలో తొక్కిసలాట జరగడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తోంది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అన్నారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునేందుకు సిద్దంగా ఉన్నాయి.. యోగి సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ అంచనాలకు మించి కోట్లాదిగా భక్తులు ఒకే రోజు తరలిరావడమే ప్రమాదానికి కారణమని తెలుస్తొంది.. ఇంకా నెల రోజులకు పైగా కుంభమేళాకు వెళ్లే అవకాశముంది అని బండి సంజయ్ వెల్లడించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. మహిళలపై వరాలు

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్‌ సీనియర్ నేత జైరాం రమేశ్‌, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్‌ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం జైరాం రమేశ్‌ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల కోసం ఐదు గ్యారెంటీలు ప్రకటించినట్లు తెలిపారు. గ్యారెంటీ అంటే పౌరుల హక్కు అన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే కులగణన నిర్వహిస్తామని.. అలాగే పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..

భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అశోక్ గజపతి అనుమతితో భూముల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటున్నాం. 500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 12 వేల మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 1.34 వేల మంది సచివాలయాల్లో పని చేస్తున్నారన్నారు. ఏక పక్ష ధోరణితో ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో సేవలు చెయ్యడానికి సచివాలయ వ్యవస్థ ఏర్పడిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ వల్ల కరోనా కంట్రోల్ అయిందని సాక్షాత్తు ప్రధాని చెప్పినట్లు గుర్తు చేశారు.. జాబ్ చార్ట్ లేకుండా సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారని తెలిపారు..

సీఎం హామీలు అమలు కాలేదంటే… ముఖ్యమంత్రి పదవికే కళంకం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇండ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం దారుణమన్నారు బండి సంజయ్‌. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలుండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంది? అని లేఖలో బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే… నేటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమని, 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికీ 9 లక్షల 80 వేల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటి? అని ఆయన వ్యాఖ్యానించారు. 40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42 వేల 267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదమని, రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటు అన్నారు బండి సంజయ్‌.

కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు

పద్మ శ్రీ అవార్డుల విషయంలో పార్లమెంట్ జీరో అవర్ లో లెవనెత్తుతా అని అన్నారు భువనగిరి ఎంపీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు కేంద్ర మంత్రి అని గుర్తు పెట్టుకోవాలని, హరీష్ రావు ముందు కేసీఆర్ ను ప్రజలకు దర్శనం ఇవ్వాలని చెప్పాలన్నారు చామల కిరణ్ కుమార్. కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. అందుకే బడ్జెట్ లో మొండి చేయి చూపిస్తున్నారని, ఈ సారి అయిన లోకసభలో విభజన హామీల గురించి బీజేపీ ఎంపీలు మాట్లాడాలన్నారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. అంతేకాకుండా.. రాష్ట్రం కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని సార్లు డిల్లికి పోయాడో కేటిఆర్ ను అడిగితే వ్యంగ్యంగా చెప్తాడని, ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి మోడీని రాష్ట్రానికి పెద్దన్న లాగ ఉండమన్నారని, కాంగ్రెస్ లో 8మంది ఎంపీలు ఉన్నారన్నారు. తెలంగాణ ప్రజలు 8మంది బీజేపీ ఎంపిలను గెలిపించారని, మిమ్ముల్ని గెలిపించింది ఎందుకు అని ఆయన వ్యాఖ్యానించారు. లక్ష్మణ్ రాజ్య సభ ఎంపీగా ఉండి ఆర్ఆర్ఆర్‌పై భువనగిరి పోయి ఫిర్యాదు చేయడం పై వాళ్ల వైఖరి అర్థం చేసుకోవచ్చన్నారు చామల కిరణ్ కుమార్. హైదరాబాద్ RRR కోసం కేంద్ర మంత్రి గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని, RRR హైదరాబాద్ లైఫ్ లైన్ దానికి 45వేల కోట్లు అవసరమన్నారు. రిజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో తో హైదరాబాద్ గ్లోబల్ సిటీ అవుతుందన్నారు.

మీర్‌ పేట్‌ మర్డర్ కేస్.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్

తెలంగాణను కుదిపేసిన మీర్‌పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. సీపీ సుధీర్‌బాబు మాట్లాడుతూ, భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ, నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని అన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతుండగా, బయటకు వస్తున్న విషయాలు తమను ఆశ్చర్యానికి గురిచేశాయని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..

వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు. వరుసగా విచారణకు సమయం కోరుతున్నారని పిటిషన్‌ను రెగ్యులర్ విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో హైకోర్టు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అమల్లోకి వచ్చిన కోడ్..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి.. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి షెడ్యూల్‌ వచ్చేసింది.. ఫిబ్రవరి 3న వీటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుండగా.. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.. ఇక, ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • congress menifesto
  • Delhi Elections
  • Meerpet Murder Case

తాజావార్తలు

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

  • Dehydration Symptoms: మండే ఎండల్లో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీ పని అంతే! ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి

  • CM Chandrababu: మొన్న మూడుముక్కలాట.. నిన్న మావిగన్.. వెయ్యి మంది సైకోలు వచ్చినా అమరావతి ఆగదు..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions