రప్పా.. రప్పా నరుకుతాం.. అంటే.. సంతోషం అంటారు జగన్..! ఖండించాలి కదా..? రప్పా.. రప్పా.. ఎవర్ని నరుకుతారు.. ప్రజలనా..? ప్రజాస్వామ్యన్నా..? అని ప్రశ్నించారు ఏపీ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చేసిన కామెంట్లపై స్పందించిన పయ్యావుల.. రాష్ట్రంలో రౌడీలు తన వెనక నడవమని జగన్ చెప్తున్నారు.. జగన్ ఎప్పుడూ భయపెట్టి రాజకీయం చెయ్యాలని అనుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్ట్ లు చేశారు.. అధికారం పోయాక రౌడీలను ఏకం…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలోని ‘గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ చెప్పి రిపోర్టులను కాసేపు నవ్వించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా?.. పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, లేదా? అని జగన్ ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ జగన్…
షర్మిల ఫోన్ ట్యాపింగ్ పై వైఎస్ జగన్ స్పందించారు. పక్క రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ తో మాకేంటి సంబంధమని చెప్పారు. షర్మిలమ్మ అప్పట్లో క్రియాశీలకంగా ఉందని చేశారేమో.. అసలు చేసారో లేదో మాకేలా తెలుస్తుందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నేతల ఫోన్లనే కాదు.. ఏపీకి చెందిన నేతల ఫోన్లు ట్యాప్ చేసి కూడా.. గతంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఇచ్చారనే ఆరోపణలు వినపడుతున్నాయి. Also…
నిజంగా సీఎం చంద్రబాబు నాయుడుకు గౌరవం ఉందా? అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజంగా గౌరవం ఉంటే.. రామగిరి మండలం ఏడుకుర్రాకులలో 9వ తరగతి చదువుతున్న బాలికను 14 మంది టీడీపీ వాళ్లు సామూహిక అత్యాచారం చేస్తే, ఏం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము సీఎం చంద్రబాబుకు లేదా? అని అడిగారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ చదువుతున్న గిరిజన బాలిక కనిపించటం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా…
సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే.. తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏపీ లిక్కర్ కేసులో ఏడాదిగా వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు లేదని, ఆయనను ఇరికించేందుకు సడెన్‌గా ఓ కానిస్టేబుల్‌తో తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నం చేశారన్నారు. తన పల్నాడు పర్యటన ముందు రోజు టాపిక్ చేయాలనే ఉద్దేశ్యంతో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. ఈ వయస్సులో రెడ్ బుక్ రాజ్యాంగం పాలన…
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల పర్యటన విజయవంతమైందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రెంటపాళ్ల పర్యటనకు జనం ఎలా వచ్చారో చూశారు కదా?.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించిందన్నారు. చంద్రబాబు మాటల్లో అసహనం కనిపిస్తోందన్నారు. కర్ఫ్యూ లాంటి పరిస్థితుల మధ్య తన పర్యటన జరిగిందని, తమ పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ బుధవారం…
వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. మాజీ సీఎం వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి, దురుసుగా ప్రవర్తించిన కారణంగా.. ఆయనపై సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంపై నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ గజ్జల భార్గవ్ రెడ్డిపై…
యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.…
ఇవాళ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశంలో జగన్ పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై వైసీపీ అధినేత మీడియాతో మాట్లాడనున్నారు. నిన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో ఈ మీడియా సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Also Read: Today Astrology:…
ఆంక్షలు, ఉద్రిక్తతల మధ్య వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన సాగింది. రెంటపాళ్లలో వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబసభ్యులను పరామర్శించారు జగన్. అధినేతకు స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చారు అభిమానులు, కార్యకర్తలు.