ఎన్టీఆర్, వైఎస్ఆర్ను దేవినేని నెహ్రూ ఎంతో ప్రేమించారని దేవినేని అవినాష్ చెప్పారు. నాన్నకు రాజకీయ జన్మ ఎన్టీఆర్ ఇస్తే.. పునర్జన్మ వైఎస్ఆర్ ఇచ్చారన్నారు. తనకు నెహ్రూ రాజకీయ జన్మనిస్తే.. వైఎస్ జగన్ పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో వైసీపీ హయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అని, రిటైనింగ్ వాల్ నిర్మించి ప్రజల కల నెరవేర్చడం జరిగిందని అవినాష్ చెప్పుకొచ్చారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ జయంతి సందర్భంగా నెహ్రూఘాట్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లబ్ వద్ద ఉన్న…
తెలుగుదేశం పార్టీని పొలిటికల్ యూనివర్శిటీగా చెప్పుకుంటారు చాలామంది. పార్టీ చరిత్ర, అందులో తయారైన నాయకులు, వాళ్ళు ఎదిగిన తీరును చూసి అలా మాట్లాడుతుంటారు పొలిటికల్ పండిట్స్. రెండు రాష్ట్రాల్లో... కులాలకు అతీతంగా ఇప్పుడున్న సూపర్ సీనియర్స్ చాలామందికి రాజకీయ జీవితం ఇచ్చిన పార్టీగా టీడీపీకి ప్రత్యేకత ఉంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రభుత్వం సరైన భద్రత కల్పించడంలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్న జగన్‌కు ప్రభుత్వం భద్రత తగ్గిస్తోందనేది వైసీపీ ఆరోపణ. గుంటూరు మిర్చి యార్డు, రాప్తాడు, తెనాలి, పొదిలి, తాజాగా సత్తెనపల్లి. ఇలా ఆయన ఏ పర్యటనకు వెళ్లినా ఆయనకు సరైన భద్రత కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు.
వైఎస్ జగన్‌కు లండన్ మందులు పనిచేయడం లేదు.. కనీసం, యోగాతోనైనా ఆరోగ్యం సక్కబడుతుంది.. యోగా ప్రాక్టీస్ చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు మంత్రి వాసంశెట్టి సుభాష్.. రప్పా రప్పా నరకటం అనే పదాన్ని సినిమాల్లో డైలాగ్లుగా చెబుతున్న జగన్.. రౌడీయిజం, హింస ప్రేరేపించేలా నీ పరామర్శ యాత్రలు ఏంటి? అని ప్రశ్నించారు..
వైఎస్ జగన్‌పై మండిపడ్డారు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రప్పా.. రప్పా.. నరకడానికి వైఎస్ జగన్ ఏమన్నా స్టేట్ రౌడీనా? అని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్న వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే సామాన్యులు రోడ్లపై తిరుగుతారా..? అని ఆవేదన వ్యక్తం చేశారు.. జగన్ రప్పా.. రప్పా లాడిస్తాడనే ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. చిత్తూరులో మాజీ ఎమ్మెల్య చింతల రామచంద్రారెడ్డి సతీమణిని పరామర్శించడానికి కుటుంబ సమేతంగా వెళ్లిన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నాయుడు మనస్థత్వంతోనే మామిడి రైతులకు ఈ దుస్థితి వచ్చిందన్నారు..
రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, ఆకృత్యాలు, అత్యాచారాలు, హత్యలపై మీరు ప్రశ్నించకుండా.. రప్పా.. రప్పా.. అంటూ మీడియా ముందుకు వచ్చేసారని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు సీదిరి అప్పలరాజు.. చంద్రబాబు చేస్తున్న మోసాలు, వెన్నుపోటు గురించి ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు, ఆయన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. చట్టాన్ని ఉల్లంఘించే విధంగా మాట్లాడే నేతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. సినిమాల్లో చెప్పే డైలాగులు సినిమా హాళ్ల వరకే బాగుంటాయని, ఆ డైలాగులను ప్రజాస్వామ్యంలో ఆచరణలో పెట్టడం సాధ్యపడదన్నారు. ఎవరు అయినా సరే చట్టాన్ని, నియమ నిబంధనలను గౌరవించాల్సిందే అని తెలిపారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అని హెచ్చరించారు.…
ఓటమి నుంచి కోలుకుని ఫుల్లీ రీఛార్జ్ మోడ్‌లోకి వచ్చేసిన వైసీపీ అధ్యక్షుడు జగన్.... వరుస పర్యటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పిరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్ళాలని భావిస్తున్నారట ఆయన.
ఒక వైపు పాజిటివ్ తో యోగా జరుగుతుంటే మరికొందరు రప్పా రప్పా అంటున్నారు.. ఒకప్పుడు ఊళ్లలో గ్రామ దేవతలకు పొట్టేళ్లు బలి ఇచ్చి రప్పా రప్పా అనేవారు.. ఇప్పుడు.. ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.. ఒకప్పుడు నేరస్తుల తో దూరంగా ఉండేవారం.. ఇప్పుడు నేరస్తులతో కలిసి రాజాకీయాలు చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.