YS Jagan: ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా..? చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్..
- సోషల్ మీడియా వేదికగా సీఎంకు జగన్ ఛాలెంజ్..
- నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?..
- మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు అంటూ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన రాజకీయంగా కాక రేపుతోంది.. జగన్ పర్యటనలో ఇద్దరు చనిపోవడం.. అందులో ఓ వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న కారు కిందే పడినట్టు వీడియోలు వెలుగు చూడడం.. జగన్‌పై కేసులు నమోదు చేయడం.. ఇలా పొలిటికల్ హీట్ పెరిగింది.. ఈ తరుణంలో.. చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ.. సవాల్ విసిరారు జగన్.. చంద్రబాబు గారు.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఛాలెంజ్ విసిరారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
Read Also: TTD: తిరుమలలో నగదు రహిత లావాదేవీలు.. టీటీడీ మరో ముందడుగు..
Also Read
- Gade Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హైకోర్టులో పిల్
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
- Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్‌బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
ఇక, జగన్ లేవనెత్తిన ప్రశ్నలు ఇలా ఉన్నాయి..
* సీఎం చంద్రబాబును ట్యాగ్ చేస్తూ.. చంద్రబాబు గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
* అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?
* ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా?
* ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్ హక్కు కాదా?
* మీకు బుద్ధిపుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే, మూడ్ రానప్పుడు మేం మీకు జడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని విత్‌డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా?
* జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ను ఫాలో అయ్యి, ఆమేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రొటోకాల్.
* మరి జడ్‌ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌మ్యాప్ ఇచ్చిన తర్వాత, పైలట్ వెహికల్స్, రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌లో భాగమైనప్పుడు, మరి మీ రోప్ పార్టీల, జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా? మనుషుల తాకిడి ఎక్కువ ఉన్న పరిస్థితుల మధ్య! అందుకే కదా జడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌లో భాగంగా ఈ రోప్ పార్టీని, పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం.
* మరి మీ పైలట్ వెహికల్స్, అందులో సెక్యూరిటీ, రోప్‌పార్టీలను జడ్‌ప్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు. ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు? మరి ఏది వాస్తవం? మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా, లేక వెహికల్ కింద ఎవరూ పడలేదన్నదా?
* జడ్ ప్లస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి, గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్‌కూడా చేయాలి. ఇది ప్రొటోకాల్. మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెట్టా. డ్రైవర్‌ను మీరు (గవర్నమెంటు) ప్రొటోకాల్ ప్రకారం ఇచ్చారు. మరి మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈవెహికల్, మీరు ఇచ్చిన పైలట్ వెహికల్స్, మీ రోప్ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్.
* ఆరోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌మెంట్ ఏమిటి?
* మరి ఎందుకు ఈ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు?
* ప్రతిపక్షంగా నేను ప్రెస్‌మీట్ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పినమాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే, మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌పోజ్ చేస్తే, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక, ప్రజల్లో మీ మీద ఉన్న వ్యతిరేకత, నామీద ప్రేమను చూసి తట్టుకోలేక, మీరు దిగజారి డైవర్షన్ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరం. కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి.
* ఒక్కటి మాత్రం నిజం. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకు వచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్, తర్వాత మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు. వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది. ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం?
* అయినా నేను చంద్రబాబుగారిని ప్రశ్నిస్తున్నా, మీ పర్యటనల సమయంలో, మీ మీటింగుల్లో చనిపోయిన వారి విషయంలో మీరు ఏం చేశారు? ఎంత చేశారు? ఎంత మేర చేశారు? మీరా మానవత్వం గురించి, నైతికత గురించి మాట్లాడేది? ఇప్పటికైనా మారండి!.. అంటూ ప్రశ్నలు సంధిస్తూ.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్..
•@ncbn గారూ.. ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారు. నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
•చంద్రబాబు గారూ.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరుకాని, మీ పవన్‌కళ్యాణ్ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 23, 2025
తాజావార్తలు
-
Hyderabad: రాత్రంతా దంచికొట్టిన వర్షం.. ఈ ఏరియా వాసులకు బిగ్ అలర్ట్..
-
Obsession: ‘రాజ్’ సినిమానే ‘అబ్సెషన్’నా? విక్రమ్ భట్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోలపై కూడా షాకింగ్ కామెంట్స్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
-
జియో, ఎయిర్‌టెల్‌కు BSNL చెక్మెట్.. రోజుకు 2.5GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో కొత్త ప్లాన్ లాంచ్.!
-
Ravi Teja : హిట్ డైరెక్టర్స్‌ను వదిలేసి.. ఫ్లాప్ దర్శకులతో మాస్ మహారాజ్ సినిమాలు
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!