Pawan Kalyan: జగన్ రప్పా.. రప్పా.. వ్యాఖ్యలు..! పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ వార్నింగ్..!!
- జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలపై పవన్ పవర్ ఫుల్ వార్నింగ్..
- రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్.. రప్పా రప్పా.. గొంతు నరుకతాం.. అంటే..
- మక్కెళ్లు విరగకొట్టి ఇంట్లో కూర్చో పెడతామని వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: వైసీపీ రప్పా.. రప్పా.. ఫ్లెక్సీలు తీవ్ర వివాదాన్నే సృష్టించాయి.. అయితే, ఆ వ్యాఖ్యలను వైఎస్ జగన్ సమర్థించారంటూ కూటమి నేతలు మండిపడుతున్నారు.. ఇక, జగన్.. రప్పా.. రప్పా.. వ్యాఖ్యలకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, లోకేష్.. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు.. అయితే, వైసీపీ వాళ్లు రోడ్డు ఎక్కి పిచ్చి బ్యానర్స్.. రప్పా రప్పా.. గొంతు నరుకతాం.. అంటే.. కాలుకి కాలు, మక్కెళ్లు విరగకొట్టి ఇంట్లో కూర్చో పెడతామని వార్నింగ్ ఇచ్చారు..
Read Also: Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 10 మంది మృతి.. భారీ భవంతులు ధ్వంసం
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ఇది ఆషామాషీ వ్యవహారం కాదు అంటూ.. జగన్ రప్పా రప్పా వ్యాఖ్యలపైకు కౌంటర్ ఇచ్చారు పవన్ కల్యాణ్.. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు, రావట్లేదు అని వ్యాఖ్యానించిన ఆయన.. గొంతులు కొసేస్తాం అని పిచ్చి బెదిరింపులు చేస్తే మక్కెలు విరగ్గొట్టి కింద కూర్చోబెడతాం అన్నారు.. అవన్నీ సినిమాల్లో బాగుంటాయి, నేను కూడా సినిమాల్లో నుండి వచ్చిన వాడినే అన్నారు.. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ జరిగింది. రాష్ట్రంలో 20 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు జరిగాయి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాం.. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం జరిగాయి. కుదేలైన ఆర్ధిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు.
Read Also: Mani Ratnam: మరో సినిమా స్క్రిప్ట్ మొదలెట్టిన మణిరత్నం.. ఈసారి అలాంటి కథ?
వైసీపీ హయాంలో అధికారులు భయ పడేవారు.. సీఎం చంద్రబాబును కూడా వేధించారు అని పేర్కొన్నారు పవన్.. కూటమి ప్రభుత్వంలో 5 లక్షల కుటుంబాలకు గ్రామీణ ఉపాధి హామీలో పని కల్పించాం.. పల్లె పండగ ద్వారా గ్రామీణ రోడ్లకు మరమ్మతులు జరిగాయి. రాష్ట్ర సరిహద్దు జిల్లాలో ఏనుగుల వల్ల ఇబ్బందులు తొలగించాం.. ఎర్ర చందనం అక్రమ రవాణా అరికట్టాం.. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు బలంగా జరుగుతున్నాయని వెల్లడించారు.. ప్రజా స్వామ్య విధానాలపై వైసీపీకి గౌరవం లేదన్నారు పవన్.. ఎక్కడ ఉన్నా వెంటాడుతాం అనే వైసీపీ ప్రకటనలు ఇబ్బందులు కలిగిస్తోందన్న ఆయన.. అప్రజాస్వామిక విధానాలు సహించబోమని హెచ్చరించారు.. ఆడ పిల్లల భద్రత కు ప్రాధాన్యత ఇస్తాం.. గొంతుకులు కోస్తాం అంటే సహించబోమన్నారు.. పిచ్చి బెదిరింపులు చెయ్యద్దు. సంస్కారం ఉంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. లా అండ్ ఆర్డర్ విషయంలో.. కరప్షన్ లేని విధానం కోరుకుంటున్నాం.. శాంతి భద్రతలు క్షీణిస్తే సహించం. చాలా దెబ్బతిని ఇక్కడ వరకు వచ్చాం.. అనవసరంగా రెచ్చగొట్టద్దు.. మాది మంచి ప్రభుత్వం.. మెతక ప్రభుత్వం కాదు.. అభివృద్ధి చేసే ప్రభుత్వం. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం. ఏ మాత్రం ఉపక్షించం.. అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలు జారిపడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
-
TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!