2024 అసెంబ్లీ ఎన్నికల్లో సోషల్ ఇంజనీరింగ్ పేరిట భారీ మార్పులు.. చేర్పులు చేసి చేతులు కాల్చుకుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 80 అసెంబ్లీ సీట్లతోపాటు పలు లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఇన్స్టంట్ కాఫీలాగా... ఇన్స్టంట్ మార్పులు చేసేసి చివరికి 11 సీట్లకు పరిమితమైంది.
Vellampalli Srinivas: జగన్ అంటే నమ్మకం- చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం గడుస్తున్న ప్రభుత్వం చేసిన తప్పుడు వాగ్దానాలు ప్రజలకు తెలిసే విధంగా పుస్తకాన్ని ఏర్పాటు చేశాం అన్నారు.
Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి.. ఒక పథకంను కూడా అమలు చేయడానికి వారికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై…
కూటమి ప్రభుత్వ నేతలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్ని వేధించాలని చూస్తున్నారని వైసీపీ పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలు ఎంత అణిచివేయాలని చూస్తే.. తాము అంత పెద్దగా ఎదుగుతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి.. సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోందన్నారు. రైతుల పరామర్శకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు అమరావతిలో కాకుమాను…
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణం ఆగదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తేల్చి చెప్పారు. రాజధాని నిర్మాణాన్ని జగన్ ఆపాలని ప్రయత్నిస్తున్నాడు.. ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉన్నా పథకాలను కొనసాగిస్తున్నాం. ఎన్డీయే ప్రభుత్వ పని తీరును ప్రజలే మెచ్చుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు.
Nara Lokesh: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. వైసీపీ ఆరోపణలు నిరూపించాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వైసీపీకి 24 గంటల డెడ్ లైన్ పెట్టారు.
YS Jagan: సీఎం చంద్రబాబుపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతున్నారు అని పేర్కొన్నారు. వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి నేను ప్రకాశం జిల్లాలోని పొదిలికి వెళ్తే.. ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? అని ప్రశ్నించారు.
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.