కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలను క్రమంగా అమలు చేస్తూనే ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్… జగనన్న విద్యా దీవెన పేరుతో.. విద్యార్థులకు అండగా నిలిచిన ప్రభుత్వం.. ఈ ఏడాది రెండో విడత జగనన్న విద్యా దీవెన నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది… రాష్ట్రంలోని దాదాపు 10.97 లక్షల మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరుస్తో… రూ. 693.81 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేయనున్నారు సీఎం జగన్. విద్యార్థులు చదువుకునే విధంగా ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం.