సీబీఐ, ఈడీ కోర్టులో నేడు సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. అయితే ఇందూ టెక్ జోన్ కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసారు. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని బీపీ ఆచార్య కోరగా.. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసేందుకు సమయం కోరారు జగన్. డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలుకు సమయం కోరారు విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ. అయితే…
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ ఐటీ పాలసీలపై సమీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే కంపెనీలకు ప్రతి ఏడాది ఇన్సెంటీవ్లను ఇవ్వాలని ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఒక ఉద్యోగి ఏడాదిపాటు అదే కంపెనీలో పనిచేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇక తిరుపతి, విశాఖ, అనంతపురంలో కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా, అవసరమైన భూములను గుర్తించాలని అధికారులను సీఎం ఆదేశించారు. Read: బీస్ట్ మోడ్ లో అక్కినేని హీరో వర్కౌట్లు…!…
ఏపీలో సంక్షేమ పథకాలు వేగంగా అమలవుతున్నాయి. లాక్డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వివిధ రకాల పథకాలను అమలుచేస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్ చేయూత రెండో విడత పథకాన్ని ఈరోజు అమలు చేయబోతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 23,14,342 మంది మహిళలకు లబ్ది చేకూరుతుంది. లబ్దిదారుల ఖాతాల్లో రూ.4,339.39 కోట్ల రూపాయలను సీఎం జగన్ జమచేయబోతున్నారు. గతేడాది ఈ…
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌తో ఒకే రోజు 13.72 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌పై ట్విట్టర్లో స్పందించిన ఏపీ సీఎం.. కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు… గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ డాక్టర్లు,…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. 2021-22 వ సంవత్సరానికి వివిధ శాఖల్లో మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది జులై నెల నుంచి వివిధ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయబోతున్నారు. జులై నెలలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇక ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1,2 కి చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ ను…
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు…
నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జరగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన ఆయన.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. మండలానికి…