ఆంధ్రప్రదేశ్‌లో వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌తో ఒకే రోజు 13.72 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేశారు.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా సాగిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై సోషల్ మీడియా వేదికగా కోవిడ్ వారియర్లకు అభినందనలు తెలిపారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్‌పై ట్విట్టర్లో స్పందించిన ఏపీ సీఎం.. కోవిడ్ పై పోరులో ఒకే రోజు 13,72,481 వ్యాక్సిన్లు వేసి ఏపీ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు… గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పీహెచ్సీ డాక్టర్లు,…
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు జాబ్ క్యాలెండర్‌ను రిలీజ్ చేశారు. 2021-22 వ సంవత్సరానికి వివిధ శాఖల్లో మొత్తం 10,143 పోస్టులను భర్తీ చేసేందుకు క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది జులై నెల నుంచి వివిధ శాఖల్లోని పోస్టులను భర్తీ చేయబోతున్నారు. జులై నెలలో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. ఇక ఆగస్టులో ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1,2 కి చెందిన 36 పోస్టులకు నోటిఫికేషన్ ను…
పేదలందరికీ ఇళ్లు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లాల్లో ప్రత్యేకంగా నియమించిన జేసీలతో క్యాంపు కార్యాలయంలో సమావేశమైన సీఎం వైఎస్ జగన్.. వారికి మార్గనిర్దేశం చేశారు.. మనం ఇప్పుడు కడుతున్న సంఖ్యలో ఇళ్లు గతంలో ఎప్పుడూ కట్టలేదని. దేశంలో కూడా గతంలో ఎన్నడూ ఇలా చేయలేదన్న ఆయన.. 28 లక్షలకుపైగా ఇళ్లు కడుతున్నాం.. 17 వేల లే అవుట్స్‌లో ఈ ఇళ్లను నిర్మిస్తున్నాం.. కొన్ని లే అవుట్స్ .. మున్సిపాల్టీల సైజులో ఉన్నాయి.. అధికారులంతా అందరికీ ఇళ్లు…
నూతన విద్యా విధానంతో ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎంతో మేలు జరగుతుందన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. విద్యాశాఖ, అంగన్వాడీల్లో నాడు–నేడుపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం.. నూతన విద్యా విధానంపై చర్చించారు.. నూతన విద్యా విధానం అమలుకై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించిన ఆయన.. రెండేళ్లలో కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.. ఇక, ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం వల్ల ఉపాధ్యాయులకు, పిల్లలకు ఎనలేని మేలు చేకూరుతుందని.. మండలానికి…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కారణంగా డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటులన్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఆర్ధిక సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు రెండుసార్లు వాహనమిత్ర సాయం అందించింది. కాగా ఇప్పుడు మూడోసారి కూడా డ్రైవర్లకు వాహనమిత్ర ఆర్ధిక సాయం చేస్తున్నది. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆన్లైన్ ద్వారా వాహనమిత్ర సాయాన్ని విడుదల చేయబోతున్నారు. ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు రూ.10వేల చొప్పున ఆర్ధికసాయం చేయబోతున్నారు. ఈ వాహనమిత్ర పథకం ద్వారా రాష్ట్రంలోని 2.48 లక్షలమంది…
ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్ కోటాలో కొత్తగా ఎంపిక కానున్న ఆ నలుగురు ఎమ్మెల్సీలు ఎవరు? అనే ఉత్కంఠకు తెరపడింది.. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఆ నలుగురు ఎమ్మెల్సీలకు ఆమోదముద్ర వేశారు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్.. సాయంత్రం తన శ్రీమతి వైఎస్ భారతితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సరిగ్గా 40 నిమిషాల పాటు గవర్నర్ దంపతులు విశ్వభూషణ్ హరిచందన్, సుప్రవా హరిచందన్‌తో సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా గవర్నర్ కోటాలో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన ఈరోజు ఎస్ఎన్బీసీ సమావేశం జరిగింది. 2021-22 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. స్కూళ్లు, ఆసుపత్రులను నాడు-నేడు కింద అభివృద్ది చేస్తున్నామని, అగ్రి ఇన్ఫ్రా, గృహాలు, ఇతర వ్యవసాయ రంగాల్లో బ్యాంకుల సమర్ధత పెరగాలని వైఎస్ జగన్ పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు తిరిగి వస్తున్నట్టు తెలిపారు. చికిత్సకోసం చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినట్టు సీఎం తెలిపారు.…
కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువులు, ఉక్కుశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం వైయస్.జగన్ భేటీ అయ్యారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్ర మంత్రికి వివరించిన సీఎం… కాకినాడ ఎస్ఈజెడ్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. వయబిలిటీ గ్యాప్ ఫండ్‌విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారంలేకుండా చూడాలన్నారు సీఎం. అయితే ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తామన్న కేంద్రమంత్రి…