కూటమి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో ఉత్తరాంధ్రను కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పాతపట్నం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు వైసీపీ ప్రధాన కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభంజనం ఏ విధంగా వీస్తుందో.. రాష్ట్రంతో పాటు దేశంలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుందని చెబుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పార్టీ చూడం, కులం చూడం.. జగనన్నకు మాత్రమే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు.
శ్రీకాళహస్తి దేవస్థానంపై బురద జల్లోద్దని.. రాజకీయ ఆరోపణలు మానుకోవాలని దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు అన్నారు. ఆలయం నుంచి వెండి తీసుకువెళ్లి బెంగళూరులో విక్రయించి..
విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మి నామినేషన్ వేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్లొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్రకు విశేషమైన స్పందన లభించిందన్నారు.
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడుకి.. అతడి తమ్ముడు సన్యాసి పాత్రుడుకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోసారి అయ్యన్న పాత్రుడుకి అతడి తమ్ముడు ఛాలెంజ్ విసిరాడు.
విశాఖ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రతీ నియోజకవర్గాన్ని టచ్ చేస్తూ.. ప్రతీ ఇంటికి వెళుతున్నారు. ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరిస్తున్నారు. నేనున్నాంటూ హామీ ఇస్తున్నారు. ఈ క్రమంలో.. అవంతి శ్రీనివాస్ తరుఫున బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మళ్లీ ముఖ్యమంత్రిగా జగనన్న రావాలి.. జగనన్న కావాలన్నారు. సంక్షేమ పథకాలు ప్రతీ ఇంటికి అందాలంటే.. అభివృద్ధి ప్రతి ప్రాంతంలో జరగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.
కేశినేని చిన్నికి కేశినేని నాని కౌంటర్ వేశారు. విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిది కార్పొరేటర్ స్థాయి కంటే హీనం అని విమర్శించారు. ఆయనకి 12 లేదా 14 వేల ఓట్లు మాత్రమే వస్తాయి.. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్ధి కూడా విజయం మీకు లేదా మాకు మధ్యే అని చెప్పాడన్నారు. ఫలితాలు చూస్తే అతనికి 12 వేల ఓట్లు వచ్చాయన్నారు.
అమరావతి: న్యాయం జరగడంలో ఆలస్యమవ్వొచ్చేమో గానీ న్యాయం మాత్రం గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహార్ అన్నారు. 1996లో జరిగిన శిరోముండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుకు 18 నెలలు జైలు శిక్ష పడటంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలన్నారు. లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని విమర్శించారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరులో స్వర్ణాంధ్ర సాధికారయాత్రలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాన్ మూడు రెక్కలు విరిగిపోతాయని దుయ్యబట్టారు. మాట తప్పను అంటూ జగన్ ఈ రాష్ట్రానికి మెడలు విరిచేసాడు.. దళితులకు అండగా ఉంటాను అని దళితులను హత్య చేస్తున్నావని సీఎం జగన్ పై మండిపడ్డారు. అక్క, చెల్లెమ్మలు అంటూ ఆస్తిలో…