Pawan kalyan: జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన భార్య వలన క్రిస్ట్మస్ చేసుకుంటానన్నారు.తనది సోషలిస్టు కుటుంబమని వెల్లడించారు. తాను ఎవరి దగ్గర పార్టీ ఫండ్ తీసుకోలేదని.. 70 వేల మంది వచ్చిన నామినేషన్ ను ఆశీర్వదించారన్నారు. 2009 లో కాకినాడ ఎస్ ఈ జెడ్ కోసం 10 వేలు ఎకరాలు తీసుకున్నారన్నారు. ప్రతి రైతు కి న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
తనకు పోటీ వంగా గీతతో కాదని.. సీఎం జగన్ తో అన్నారు. తాను మాట ఇచ్చానంటే తల తెగి పడిన వెనక్కి వెళ్లలని చెప్పారు. దేశంలో ఒక్క పదవి లేకుండా దశాబ్దం కాలం పార్టీ నడిపింది తానొక్కడేనని స్పష్టం చేశారు. సీట్లు కుదించుకుని కూటమి కి కృషి చేసినట్లు తెలిపారు. వంగా గీత వచ్చినప్పుడు జెట్టి గురించి ప్రశ్నించండన్నారు. చలమలశెట్టి సునీల్ ను అడగండి… రాత్రి వేళలు వచ్చి వెళ్లడం కాదు.. దమ్ముంటే సమాధానం చెప్పమనండని విమర్శించారు. కేంద్రంతో వెళ్లి మాట్లాడటానికి సునీల్ సరిపోడన్నారు. సునీల్ వ్యక్తి గతంగా స్నేహితుడైనా రాజకీయాలలో స్నేహం చూడనని స్పష్టం చేశారు.ఉప్పాడ చీర కు ప్రపంచ గుర్తింపు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
బలమైన మెజారిటీ రావాలని ఓటర్లను కోరారు. సమస్యల పరిష్కారానికి ఆయుధం అవుతానన్నారు. ఎమ్మెల్యే అంటే పిఠాపురం ఎమ్మెల్యే లా ఉండాలనే విధంగా పని చేస్తానని తెలిపారు. అసెంబ్లీలో మీ ఆత్మ, గొంతు అవుతానని చెప్పారు. తన భార్య రాజకీయాల్లో ఉంటే నువ్వు తులనాడినా ఫరవాలేదని.. గుట్టుగా ఉన్న వాళ్ళని బయటకు తెస్తున్నారని మండిపడ్డారు.కొందరికి కుదరక అలా జరుగుతుందన్నారు. నేను నీకు లా కుటుంబము గురించి, మహిళలు గురించి మాట్లాడలేనన్నారు. జగన్ లాల్ బహుదూర్ శాస్త్రినా… వాజ్ పేయినా? ఐదేళ్ల గా బెయిల్ పై ఉన్నాడడానికి అని ప్రశ్నించారు. తాటాకు చప్పుళ్ళుకి భయపడనని.. పవన్ అనే వాడు గొంతు విప్పితే ప్రజలుకి న్యాయం జరగాలన్నారు.