పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి వ్యక్తి గత గొడవలు లేవని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. పవన్ భార్య గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఈ రోజు ఎన్టీవీలో నిర్వహించిన క్వశ్చన్ అవర్ లో జర్నలిస్టులు సంధించి ప్రశ్నలకు మాజీ మంత్రి పేర్ని నాని సమాధానమిచ్చారు. “మనం ఏదైనా పార్టీ పెడితే పార్టీ సిద్ధంతాల కోసం పాటుపడాలి. ఇంకో వ్యక్తి ప్రయోజనం కోసం కాదు. చంద్రబాబు కోసం పవన్ పార్టీ పెట్టారు. పవన్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. 2012లో చంద్రబాబుని కలిశానన్నారు. అప్పుడే పార్టీ పెడతానని చంద్రబాబుతో చెబితే.. తాను పార్టీ పెడితే జగన్ సీఎం అవుతాడు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చంద్రబాబు తనతో చెప్పినట్లు పవన్ చెప్పారు. అందుకే 2012లో పార్టీ పెట్టకుండా ఆగాను అని పవన్ చెప్పారు. 2018 వరకు చంద్రబాబు, పవన్ ఇద్దరు కలిసే ప్రభుత్వాన్ని నడిపారు. 2018 తర్వాత నిదానంగా లోకేశ్ ని తడుతూ.. పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్. అప్పుడు తిట్టిన పవన్ మళ్లీ ఎందుకు చంద్రబాబుతో కలిశారు. జగన్ బాబాయి విషయాన్ని మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తున్నారు. కోర్టు మీద గౌరవం లేకుండా కోర్టులో ఉన్న కేసు గురించి మాట్లాడుతున్నారు. పవన్ ను నేనేప్పుడూ కాపు అని తిట్టలేదు. పవన్ ఒక ఆడియో ఫంక్షన్లో నాపై అసభ్యకరంగా మాట్లాడారు. ఆయన తిడితే.. నేను తిడతా.. చిరంజీవి కంటే కూడా చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ అంత ఇష్టం.”
READ MORE: CM Revanth Reddy: అక్కడ మోడీ, ఇక్కడ కేడీ కలిసి కాంగ్రెస్ని ఓడించాలని చూస్తున్నారు..
కాపుల గురించి అగిన ప్రశ్నలపై పేర్ని నాని మాట్లాడుతూ.. “కాపులు ఎవరి గుత్త సొత్తు కాదు. వారికి ఆలోచన శక్తి ఉంది. గొర్రెల మందలాగా వెళ్లి పోరు. జగన్ మోహన్ రెడ్డి ద్వారా మంచి జరుగుతుందని భావించే వారు ఆయన్ని వీడరు. మెజార్టీ కాపులు మాతోనే ఉన్నారు. కాపులందరూ పవన్ కల్యాణ్ వైపు లేరు. అన్ని కులాల వాళ్లు ఒకే వైపు ఉండరు. ఒక వేళ చంద్రబాబు, పవన్ ఇద్దరు చెరో సగం సీట్లు తీసుకుని ఉంటే.. ఒకటో రెండో ఏళ్లు పవన్ ను సీఎం చేస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఉంటే.. కులం అనేదానికి అర్థం ఉండేది. మొదటి సారి కాపు వాళ్లకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తుందిలే అనుకునే వాడిని. ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి కాపులు ఎందుకు ఓటేస్తారు. ఏపీలో రెడ్లు, కమ్మలు, కాపులు తప్ప వేరే వాళ్లు ఎవ్వరూ లేరన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో కుల పరంగా ఓట్లు అడుగుతారు. ఏపీలో ఉంటే ఏమైంది. బహిరంగ సభలు పెట్టి ఓ కులానికి చేస్తామని చెప్పడం వేరు. ఓకే కులస్థులతో మీటింగ్ పెట్టి ఓట్లు అడగడం వేరు. తెలంగాణలో ఇది ఎక్కువగా ఉంది.”
బందర్ పోర్టు కావాలనే ఉద్యమం చేశానని స్పష్టం చేశారు పేర్ని నాని. పోర్టు కోసం 22 గ్రామాలు అక్కడి నుంచి తరలిస్తామంటే వాటి వద్దని ఉద్యమాలు చేశామని తెలిపారు. ప్రస్తుతం ఎక్కువ శాతం ప్రభుత్వ భూమిలోనే పోర్టు నిర్మాణం జరుగుతుందన్నారు. రైతులను ఒప్పించి వారు చెప్పిన ధరను చెల్లించి భూమి సేకరించామని తెలిపారు. 1983 నుంచి 2024 వరకు 40 ఏళ్లలో బందర్లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. బందరు ఓటర్లకు స్టేట్ పల్స్ తెలుసని.. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు కూడా సినిమా పల్స్ ని మొదట బందరు వాళ్లనే అడిగే వారని వెల్లడించారు. వైసీపీకి ఎప్పుడూ సేవలందించేందుకు సిద్ధమని జగన్ తో చెప్పినట్లు తెలిపారు. పార్టీ ఏ పని అప్పగిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. జగన్ అవకాశం ఇవ్వడంతోనే మంత్రి పదవి దక్కిందని స్పష్టం చేశారు. జగన్ ఎవ్వరి గురించి వ్యక్తి గతంగా విమర్శించలేదని ఏమైనా ఆధారాలు ఉంటే చూపించండన్నారు.