ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే నాయకులకు సవాల్ చేస్తున్నా.. డీఎన్ఆర్ అనే వ్యక్తిని దాటుకొని రావాలన్నారు. అక్కడ ప్రజలను 40 ఏళ్ల నుంచి పీల్చి పిప్పి చేశారని.. ఆటపాక గ్రామానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
Birthday Celebrations: గగనతలంలో తల్లికి పుట్టినరోజు వేడుకలు చేసిన బుడ్డోడు.. వీడియో వైరల్..
కానీ.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశామని దూలం నాగేశ్వరరావు తెలిపారు. తాము చేసిన అభివృద్ధి గురించి ఈ గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారన్నారు. అంతేకాకుండా.. ఈ గ్రామానికి సంబంధించిన భూములు, ఆస్తులను దోచుకున్న వారిని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరిమికొట్టారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ ఒక్కరూ ధైర్యంగా ఇళ్లు కట్టుకుంటున్నారని.. ఎలాంటి దాడులు, అన్యాయాలు లేవన్నారు.
AP High Court: వాలంటీర్ల రాజీనామాతో సంబంధం లేదన్న ఈసీ.. హైకోర్టు కీలక ఆదేశాలు..
తమ సమక్షంలో 500 మందికి ఇళ్ల స్థలం, ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. కానీ.. గత 40 సంవత్సరాల నుంచి ఉన్న నాయకులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఓట్లు రాగానే ప్రజలను వాడుకోవడం.. తర్వాత గాలికి వదిలేయడమని టీడీపీపై దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. కానీ.. తాను నిరుపేదలకు, ఇళ్లు లేని వారికి సహాయం చేసినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆటపాక గ్రామానికి రూ.2 కోట్ల 80 లక్షలతో అభివృద్ధి పనులు చేశానని అన్నారు. ఈ సందర్భంగా.. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్లీ సీఎంగా జగనన్నను, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని దూలం నాగేశ్వరరావు కోరారు.