ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు.. KDCC బ్యాంక్ చైర్మన్ తాతిలేని పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ…. జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. అక్కా చెల్లెలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని తెలిపారు.
Delhi High Court: భార్య వివాహేతర సంబంధం కలిగి ఉందని తప్పుడు ఆరోపణలు చేయడం మానసిక క్రూరత్వమే..
ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపెయినర్గా పనిచేయాలని.. ఇంకా సమయం 15 రోజులే ఉందని కార్యకర్తలకు గుర్తు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు. ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీకి రెండు ఓట్లు వేయించే విధంగా గ్రామాల్లో పనిచేయాలని ఆయన కోరారు. ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న చేసిన సంక్షేమలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిగా మరోసారి చేసుకుంటే కలిగే ప్రయోజనాలను ఓటర్లకు వివరించాలని
కార్యకర్తలను కోరారు.
T20 WC 2024: టీ20 వరల్డ్ కప్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న సిక్సర్ల కింగ్.. ఆఫీసియల్..