ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 55 డివిజన్లో ఎంపీ కేశినేని నాని కుమార్తె.. కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ.. వైసీపీకే ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదు సంవత్సరాల నుంచి పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు, అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నారని.. ఎంతమంది కూటమి పార్టీలన్నీ గుంపుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి…
అమరావతిలో వైసీపీ పార్టీలో భారీ చేరికలు జరుగుతున్నాయి. ఇటీవల ముస్లిం మైనారిటీ సోదరులు భారీ ఎత్తున పార్టీలో చేరగా.. ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన 35 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు స్వయంగా కండువాలు కప్పి వారందరినీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో జరిగిన అభివృద్ధికి, ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి తేడా చూడాలని కోరారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అందరికీ అభివృద్ధితో పాటు సంక్షేమం…
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు.. KDCC బ్యాంక్ చైర్మన్ తాతిలేని పద్మావతి హాజరయ్యారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.... జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని సూచించారు. అంతేకాకుండా.. అక్కా చెల్లెలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని…
టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని తాను కోరుకుంటున్నా అని వైసీపీ లోక్సభ అభ్యర్థి విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీని వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి టీడీపీలోకి వెళ్లారని మండిపడ్డారు. అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి.. ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు. విద్యను వ్యాపారం చేసి మహిళలను నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని మూలపేట ప్రాంతంలో ఈరోజు విజయసాయి రెడ్డి ఎన్నికల…
ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా మార్చి 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. బుధవారం (ఏప్రిల్ 24) శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188…
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
ఏలూరు జిల్లా కైకలూరు వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు సమక్షంలో ఆటపాక గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. దాదాపు 200 మంది కార్యకర్తలకు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో జనాలకు మాయమాటలు చెబుతూ, మోసాలు చేస్తున్నారని అన్నారు. తమ వెనుకాల నిలబడకుంటే కుటుంబాలను సైతం బెదిరిస్తున్నారని తెలిపారు. ఆ బెదిరించే…
మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహ శీలి, ప్రజాసేవకులు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
జై భీమ్ స్ఫూర్తి తో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. ఉప్పాడ కొత్తపల్లి సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. తన భార్య వలన క్రిస్ట్మస్ చేసుకుంటానన్నారు.