మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జలదంకి మండలంలోని గట్టుపల్లిలో టీడీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని గడపగడపకు తిరుగుతూ సౌమ్యుడు, స్నేహ శీలి, ప్రజాసేవకులు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని అదే విధంగా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి కాకర్ల సురేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రం సుబిక్షంగా ఉంటుందని, పెట్టుబడులతో పాటు పరిశ్రమలు వస్తాయని, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపారు. అదే విధంగా రైతాంగం కోసం సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.
READ MORE:Sidhu Moosewala: లోక్‌సభ బరిలోకి సిద్ధూ మూసేవాలా తండ్రి.. ఎక్కడ్నుంచంటే..!
కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం..!
వింజమూరు పంచాయతీ పరిధిలోని బొమ్మరా చెరువు గ్రామానికి సంబంధించిన 20 కుటుంబాలు మంగళవారం ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గత రెండు సంవత్సరాలుగా కాకర్ల సురేష్ ఆ గ్రామానికి సమీపంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి, ఉదయగిరి నియోజకవర్గం ప్రజానీకానికి విశేష సేవలందిస్తూ ప్రజల ఆదరభిమానాలు చూరగున్న ప్రజానేత కాకర్ల సురేష్ వెంట నడవాలని ఆయనకు మద్దతుగా నిలవాలని తెలుగుదేశం పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. అదేవిధంగా అపర భగీరథుడు నెల్లూరు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. కొండాపురం మండలం చింతల దేవి పంచాయతీ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం బీసీ కాలనీకి చెందిన 50 కుటుంబాలు కాకర్ల సురేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు.. వింజమూరులో మంగళవారం ఉదయగిరి తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారానికి చేపట్టారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి పంచాయితీ బస్టాండ్ సెంటర్ వరకు ప్రధాన రహదారి వెంబడి ప్రతి దుకాణాన్ని ఇంటిని సందర్శించి సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మరియు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ చేకూర్చవలసిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు పథకాలను తప్పకుండా అమలు చేస్తారని రాష్ట్ర భవిష్యత్తును బంగారు మయం చేస్తారని తెలిపారు.
సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న కాకర్ల సురేష్ దంపతులు..!
వరికుంటపాడు మండల కేంద్రంలోని శ్రీ సీతారాముల ఆలయం నందు శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకొని రాములోరి కళ్యాణం సుంకర వంశస్థుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. చలువ పందిల్లు మామిడి తోరణాలు, వేద పండితుల మంత్రాస్త్రాల నడుమ అత్యంత సుందరంగా అలంకరించిన వేదికపై సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ కాకర్ల ప్రణీత దంపతులు హాజరయ్యారు. ముందుగా సంకర వెంకటాద్రి అంజనాద్రి లు గ్రామ నాయకులు మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు హరికృష్ణ కాకర్ల దంపతులకు ఆశీర్వాదాలు అందించారు. మరోవైపు.. వింజమూరు పట్టణంలోని యర్రబెల్లి పాలెంలో వేంచేసియున్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఐదవ రోజు గరుడ సేవను నడిమూరు భక్త బృందం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. నడిమూరు నుండి ఉదయం బయలుదేరే సమయంలో నడిమూరు భక్త బృందం కోరిక మేరకు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ బ్రహ్మోత్సవాలలో పాల్గొని సాంప్రదాయబద్ధంగా పూలు పండ్లు ఉన్న తాంబూలాన్ని తన శిరస్సుపై ఉంచుకొని జై చెన్నకేశవ అంటూ బయలుదేరారు. వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాలలో ఎమ్మెల్యే హోదాలో దర్శన భాగ్యం కలిగించు దేవా అంటూ వేడుకున్నారు.