ఆత్మకూరు బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో ఎవరూ ఆనందంగా లేరని.. కేవలం మాత్రమే జగన్, విజయ సాయి రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బా రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి బాగుపడ్డారన్నారు. టీడీపీ మేనిఫెస్టో సూపర్ హిట్ అన్నారు. తన దగ్గర డబ్బుల్లేవు ఏమీ చేయలేనని జగన్ చెప్పారని విమర్శించారు. నాయకుడికి విజన్ ఉండాలి.. పరిపాలన దక్షత ఉండాలన్నారు. అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నారు. పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. జగన్ ఎక్కడ చదువుకున్నాడో తెలియదని.. నేరాలు.. ఘోరాలు చేయడంలో పి.హెచ్.డి.చేశారని విమర్శించారు. పట్టాదారు పాస్ పుస్తకం పై జగన్ బొమ్మ వేసుకున్నారన్నారు. ఆస్తి అనేది ఒక హక్కు భద్రతని.. అలాంటి భూ రికార్డులను జగన్ మారుస్తున్నరని చెప్పారు. వేమిరెడ్డికి పోటీ ఎవరో తెలుసా.. ప్రాంతంలో ఆ వ్యక్తిని ఎప్పుడైనా చూశారా.. అని ప్రజలను అడిగారు. నిస్వార్థ సేవ కోసం ప్రభాకర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయనకు మద్దతు ఇవ్వమని కోరారు.
READ MORE: Mobile Internet: ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా.. అయితే ఇలా చేయండి..
పెన్నా డెల్టా కింద సాగునీరు అందలేదని.. సోమశిల ప్రాజెక్టును ఎన్టీరామారావు హయాంలో నిర్మించారని తెలిపారు. కండలేరు జలాశయం నిర్మించి నీటి నిల్వ చేశారు.. తెలుగంగ ప్రాజెక్టును కూడా ఎన్టీ రామారావు తీసుకొచ్చారని పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వర్షాలు లేక నీరు రాకపోతే శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు నీరుని తీసుకొచ్చామని తెలిపారు. సోమశిల ప్రాజెక్టు ఆఫ్రాన్ పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. నెల్లూరులో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా ఉపయోగం లేదన్నారు. రైతుల ధాన్యాన్ని దోచుకున్నారని రైతులకు రూ.20వేల సాయంతో పాటూ యంత్రాల ఆధునికీకరణకు సహకారం అందిస్తామన్నారు. జగన్ విడుదల చేసిన మేనిఫెస్టోలో రైతుల గురించి ఏమీ చెప్పలేదన్నారు. పోలవరం పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానాన్ని చేస్తామని చెప్పిన జగన్ మాటతప్పారన్నారు. 99.5 శాతం హామీలు అమలు చేశానని చెప్పాడు.. మద్యపాన నిషేధం అమలు చేశారా..? అని ప్రశ్నించారు.