ఎన్నికల ప్రచారంలో వైస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు దూసుకుపోతున్నారు. ప్రతి గడప గడపకు తిరుగుతూ… మరొక అవకాశం ఇవ్వాలని కోరుతూ… ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ.. ఫ్యాన్ గుర్తు కు ఓటు వేసి, మరొకసారి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని జగన్మోహనరావు కోరుతున్నారు. పూలతో, హారతులతో మహిళలు, ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.
Yuvraj Singh: భారత్ వరల్డ్‌కప్ గెలవాలంటే.. వారు ఆ పని చేయాలి..!
ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరులపాడు మండలం పలు గ్రామాల్లో విచ్చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావుకు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు. విజయ తిలకం దిద్ది మహిళలు హారతులు పట్టారు. అంతేకాకుండా.. అభివాదాలు చేస్తూ జగన్ మోహన్ రావును అవ్వాతాతలు ఆశీర్వదించారు. అటు.. యువకులు డ్యాన్సులతో హోరేత్తించారు.
Kejriwal: ఢిల్లీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం.. ఎంసీడీ స్కూళ్ల తీరుపై ఆక్షేపణ
ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి పథకాలు అందాలంటే జగనన్నను గెలిపించండని కోరారు. పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలంటే… జగనన్నకు మద్దతు ఇవ్వండి అంటూ మొండితోక జగన్ మోహన్ రావు అభ్యర్థించారు. అంతేకాకుండా.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలే నడిపిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా.. వీరులపాడు మండల గ్రామాల్లో…. “డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు” మేమే నడిపిస్తాం…. మేమే గెలిపిస్తాం…. అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రచారంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.