వాలంటీర్ వ్యవస్థ, రైతు భరోసా, నాడు నేడు , వంటి కార్యక్రమాలతో తాను ప్రజల్లో మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నానని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పొన్నూరు సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. “చంద్రబాబు నువ్వు నిజంగా అంత పుడింగివి అయితే, బచ్చా అంటున్న నన్ను ఎదుర్కోవడానికి నీకు ఇన్ని పార్టీలతో పొత్తులు కావాలా? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నువ్వు ఇలాంటి ఒక కార్యక్రమమైన ఎందుకు చేయలేకపోయావు. లంచాలు లేని వివక్షలేని సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి పేద కుటుంబానికి నేను అందించాను. నేను బచ్చానైతే ,నువ్వు చేసింది ఏంటి చంద్రబాబు..? నువ్వు 14 ఏళ్లలో ఏమి చేయకపోగా, నన్ను బచ్చా అంటూ మాట్లాడుతున్న, చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పాలి. 130 సార్లు బటన్ నొక్కి 2, లక్షల 70 వేల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేశాను. రెండు లక్షల 31 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో మెజారిటీ నా ఎస్సీలు, నా ఎస్టీ లు , నా బీసీలు, నా మైనార్టీలు ఉద్యోగాలు చేస్తున్నారు. 200 స్థానాలకు గాను 50 శాతం సీట్లు నా ఎస్టీలకు, నా ఎస్సీల కు ,నా బీసీలకు నా మైనార్టీలకు ఇచ్చాను. ఇదంతా చేసిన నన్ను, చంద్రబాబు బచ్చా అంటున్నాడు.”
READ MORE: Love Guru OTT: ఓటీటీలోకి రాబోతున్న విజయ్ ఆంటోనీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
మూడుసార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు, సామాజిక న్యాయం ఏం చేశాడో చెప్పాలని సీఎం జగన్ ప్రశ్నించారు.” పొన్నూరు సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాల బాబు. నీ కూటమి ఎలాంటిదో, 2014లో మీరు ప్రకటించిన మేనిఫెస్టో నే చెబుతుంది. ముఖ్యమైన హామీలు అని చెప్పి, ప్రజలందరినీ మోసం చేశారు. మరి అలాంటి కూటమి మళ్ళీ వస్తుంది. మళ్ళీ నమ్మాలా ? ప్రజలను మోసం చేయడానికి సూపర్ సిక్స్ అంటున్నారు. ఇంటింటికి బంగారం, బెంజ్ కార్, ఇస్తామంటారు కానీ నమ్మొద్దు. వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికి రావాలన్న, పేదవాడు భవిష్యత్తు మారాలి అన్న.. పథకాలన్నీ కొనసాగాలన్నా, ప్రతి పథకం మీ ఇంటికి రావాలన్న, మన పిల్లలు, మన చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం ,ఆరోగ్యం, వ్యవసాయం, మెరుగుపడాలన్న వైసీపీకి ఓటు వేయండి. ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి. మంచి చేసే ఫ్యాను ను ఇంట్లో పెట్టుకోండి. చెడు చేసిన సైకిలను బయట పడేయండి. తాగి పడేసే గ్లాసును సింక్ లో పడేయండి. పొన్నూరు ఎమ్మెల్యేగా అంబటి మురళిని గెలిపించండి. గుంటూరు ఎంపీగా కిలారు రోశయ్యను గెలిపించండి.”