జగనన్న అందిస్తున్న నవరత్నాలు మరింత ప్రకాశవంతంగా మెరిసే విధంగా ఈ మేనిఫెస్టోను రూపకల్పన చేశారని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఈ రోజు పశ్చిమగోదావరిజిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు సైతం ముక్కు మీద వేలేసుకునేలా ఈ మేనిఫెస్టో రూపకల్పన జరిగిందని తెలిపారు. దేశంలోనే ఏ జాతీయ పార్టీ కూడా ఈ స్థాయిలో మేనిఫెస్టో పెట్టలేదని.. మన పార్టీ గతంలో విడుదలన చేసిన మేనిఫెస్టో వందకి 99% పూర్తి చేసామన్నారు. ఇప్పుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో కూడా 100కు 100% పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ మేనిఫెస్టోలాగా వెబ్సైట్ నుంచి మేనిఫెస్టో తొలగించే పరిస్థితి మాది కాదని తెలిపారు. మాటిచ్చామంటే చేస్తామని చెప్పారు. గతంలో మన మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చేశామని చెప్పారు.
READ MORE:Miss Universe Buenos Aires: 60 ఏళ్లకు అందాల కిరీటం.. చరిత్రలోనే తొలిసారి..
అయితే ఈ రోజు ఉదయం వైసీపీ తన మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించి 9 ముఖ్యమైన హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు. అందులో వైఎస్సార్ చేయూత పెంపు, వైఎస్సార్ కాపు నేస్తం పెంపు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం, అమ్మ ఒడి, వైఎస్సార్ సున్నా వడ్డి రుణాలు, వైఎస్సార్ కల్యాణ మస్తు, షాదీ ముబారక్, ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగింపు, గృహ నిర్మాణ పథకం కింద ఏటా వెయ్యి కోట్లు, పెన్షన్ల పెంపు, రైతు భరోసా పెంపు, మత్యకార భరోసా, వాహన మిత్ర, రూ. పది లక్షల ప్రమాద బీమా, చేనేత నేస్తం, లాయర్లకు లా నేస్తం, స్కిల్ హబ్ కొనసాగింపు వంటి పథకాలను ప్రవేశ పెట్టారు.