కూటమి అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆత్మకూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. “బ్యాండేజ్ పెట్టుకొని ప్రజల సానుభూతి కోసం పాకులాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.. గులకరాయి డ్రామా ఆడారు. గతంలో కోడి కత్తితో సానుభూతి కోసం ప్రయత్నించారు. రూ.14 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలపై భారం మోపారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి గణనీయంగా పెంచారు. వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులకు చెప్పి మాట తప్పరు. ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా సాగుతోంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరైనా నాపై కేసు పెట్టారా.. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. మెగా డీఎస్సీ పైనే మొదటి సంతకం పెడతాం. నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం.
READ MORE: Varun Tej: పిఠాపురంలో బాబాయికి అండగా అబ్బాయి ప్రచారం..
టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకూ న్యాయం చేస్తామని చంద్రబాబు అన్నారు. ఆత్మకూరులో ఆయన మాట్లాడారు. ” అంగన్వాడీలకు హోంగార్డులకు న్యాయం చేస్తాం. ఇంటి వద్దనే పింఛన్లు ఇస్తాం. మన సూపర్ సిక్స్ సక్సెస్.. నవరత్నాలు వెలవెలబోతున్నాయి. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఆర్థిక సాయం ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం. రాబోయే రోజుల్లో కులగణనతో పాటు స్కిల్ గణన కూడా చేయిస్తాం. ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ పార్టీ మారితే ఎంతో అవమానించారు. పెత్తందారుల తీరు ఇలా ఉంటుంది.” ఎమ్మెల్యే విక్రం రెడ్డి అనుచరులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.