ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ సొంతమైంది. ఒక ఓటు తేడాతో చైర్మన్ పీఠంను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్‌గా ఇండిపెండెంట్‌గా గెలిచి.. టీడీపీకి మద్దతు ఇచ్చిన శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. Also Read: RK Beach: పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల…
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైలులోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు. Also Read: Kondapalli Municipal Election: నేడు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్…
నేడు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైకోర్టు తీర్పు సీల్డ్ కవర్‌ను అధికారులు తెరవనున్నారు. కవర్లో విజేత ఎవరనేది తేలనుందా? లేక టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చి దాదాపుగా 30 రోజులు అవుతోంది. దాంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. Also…
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
రాజధాని మహిళలను కించపరిచేలా జర్నలిస్ట్ అని చెప్పుకునే కృష్ణంరాజు నీచంగా మాట్లాడారని కాంగ్రెస్ మహిళా నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. నాలుగేళ్లు అలుపెరగని పోరాటం చేసిన మహిళలను దూషిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరలా మహిళలు పోరాటం చేయాల్సిన పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంత జరిగినా రాజధాని మహిళలు బయటకు వచ్చే వరకు ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను తిడితేనే అరెస్టులు చేస్తారా?.. రాజధాని మహిళలను కించపరిచేలా…
Jogi Ramesh : మాజీ మంత్రి జోగి రమేశ్ అమరావతి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ ఓటమికి అమరావతి కూడా ఒక కారణమే అంటూ చెప్పారు. ఎన్టీవీతో మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే మూడు రాజధానులు తీసుకువచ్చారు. కానీ అమరావతి ప్రజలకు అది నచ్చలేదు. అమరాతి కూడా మా ఓటమికి ఒక కారణమే. ఈ విషయాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్…
Anagani Satyaprasad : అమరావతి మహిళలను కించపరచడంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సీరియస్ అయ్యారు. అమరావతి మహిళలను అత్యంత దారుణంగా కించపరచడం నీచాతినీచం అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం జగన్ కు, ఆయన పేటీఎం బ్యాచ్ కు ఇంత కన్నా మంచి మాటలే రావా. ఇంతలా విషం కక్కుతారా. చివరకు మహిళలను కించపరచడం వైసీపీ చిల్లర బుద్ధికి నిదర్శనం. సీఎం చంద్రబాబు చెప్పినట్టు అమరావతి నిజంగానే దేవతల రాజధాని. రాజధానిని నిర్మించడానికి మేం…
Sri Bharath : స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తొలగిస్తున్నారంటూ వస్తున్న రూమర్లపై తాజాగా ఎంపీ శ్రీ భరత్ స్పందించారు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్టు కార్మికులను తొలగించిన మాట వాస్తవమే అన్నారు. కంపెనీ మేనేజ్ మెంట్ అవసరం అయిన వారిని ఉంచి మిగతా కాంట్రాక్టు కార్మికులను తొలగించారని చెప్పారు భరత్. కంపెనీని తిరిగి లాభాల్లోకి తేవడానికే ఇలాంటి చర్యలు చేపడుతున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. బ్లాస్ట్ ఫర్నిస్ త్రీ ప్రారంభించినప్పుడు అవసరమైతే కార్మికులను తిరిగి తీసుకుంటామని చెప్పుకొచ్చారు.…