Anchor Shyamala: పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా?.. ప్లకార్డ్ ప్రదర్శించిన శ్యామల!
- పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన శ్యామల
- డీసీఎం ఎక్కడైనా కనిపించారా? అంటూ ప్లకార్డ్
- బాలకృష్ణది అసలు గెలుపు కానే కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదని విమర్శించారు. శ్రీ సత్యసాయిలో ఈరోజు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ‘డిప్యూటీ సీఎం’ పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కనిపించారా? అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు. పవన్ గురించి శ్యామల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పవన్ కళ్యాణ్ సహా నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా యాంకర్ శ్యామల హాట్ కామెంట్స్ చేశారు. ‘రాష్ట్రంలో కూటమి నాయకుల గెలుపు కానే కాదు.. అంతా మాయ. హిందూపూర్‌లో ఓ పోలింగ్‌లో వైసీపీకి ఒక్క ఓటు వచ్చిందంటే.. నందమూరి బాలకృష్ణ గెలుపు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. బాలకృష్ణది అసలు గెలుపు కానే కాదు. మూడుసార్లు ఎమ్మెల్యేగా బాలకృష్ణ గెలిచినా.. హిందూపూర్‌లో అభివృద్ధి శూన్యం. హిందూపూర్‌లో డిగ్రీ కళాశాల లేని పరిస్థితి ఉంది, కేవలం బోర్డుకే పరిమితమైంది. బాలకృష్ణ సినిమా షూటింగ్‌లో బిజీ, ఆరు నెలలకు ఒకసారి హిందూపూర్ వస్తారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవేవో మాట్లాడిన పిఠాపురం పీఠాధిపతి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కనబడటం లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కనిపించారా?’ అంటూ శ్యామల ప్లకార్డ్ ప్రదర్శించారు.
Also Read
Also Read: APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి కొత్త తలనొప్పి!
సీరియల్ నటిగా పరిచయం అయిన శ్యామల.. అనంతరం యాంకర్‌గా మారారు. చాలా టీవీ షోలకు ఆమె హోస్ట్‌గా పని చేశారు. పలు సినిమా ఈవెంట్లలోనూ యాంకరింగ్ చేశారు. శ్యామల బిగ్ బాస్ హౌస్‌కు కూడా వెళ్లారు. పలు సినిమాల్లో నటించిన ఆమె.. కొంత కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి వైసీపీ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వైసీపీ పార్టీ కోసం తన గళం వినిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Xi Jinping Meeting: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారి భారత్‌కు జిన్‌పింగ్.. మోడీ-చైనా అధ్యక్షుడి భేటీపై ఉత్కంఠ
-
Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
-
Hyundai Lounge Edition: మూడు Hyundai SUVలకు కొత్త లుక్, కొత్త ఫీచర్లు.. Lounge Edition లాంచ్, ధరలు ఇవే
-
CM Chandrababu Warns Collectors: కలెక్టర్లకు సీఎం వార్నింగ్.. డీఎస్సీపై ఇద్దరు మహిళా ఐఏఎస్‌లకు ప్రశంసలు..
-
AP Railway Connectivity: ఏపీలో రైల్వే కనెక్టివిటీకి భారీ ఊతం.. రూ.1,157 కోట్లతో కొత్త రైల్వే లైన్లు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?