వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశంలో నవ్వులు పూయించారు. అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాలోని ‘గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం’ అనే డైలాగ్ చెప్పి రిపోర్టులను కాసేపు నవ్వించారు. పుష్ప సినిమాలో డైలాగ్ పెట్టినా తప్పేనా?.. పుష్ప మాదిరి గడ్డం అన్నా తప్పే.. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?, లేదా? అని జగన్ ప్రశ్నించారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటనకి పోలీసులు ఆంక్షలు విధించడం, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై నేడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు.
Also Read: YS Jagan: 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము చంద్రబాబుకు లేదా?
వైఎస్ జగన్ బుధవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లె నియోజకవర్గంలోని రెంటపాళ్లకు వెళ్లినప్పుడు.. ఓ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించాడు. ‘2019లో వైసీపీ వచ్చిన వెంటనే.. గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడినీ’ అని ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ‘ అన్న వస్తాడు.. అంతు చూస్తాడు’, ‘ఐయామ్ డిక్లేరింగ్ ద వార్.. జగన్ 2.0, అన్న వస్తాడు.. అంతు చూస్తాడు’, ‘ఎవడైనా రానీ.. తొక్కిపడేస్తాం’ అని వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ప్రదర్శించాయి. ఫ్లెక్సీ పట్టుకున్న ఓ వ్యక్తి టీడీపీకి సంబందించిన అతడు అని, టీడీపీ సభ్యత్వం కూడా ఉందని ఓ రిపోర్టర్ అడగగా.. అవునా? అని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబు మీద కోపంతో వైసీపీలోకి మారాడని సంతోష పడదాం అని జగన్ జవాబిచ్చారు. కార్యకర్త మారి.. టీడీపీనే రప్పా రప్పా కోసేస్తా అని అంటున్నాడని కూడా సంతోషపడుదాం అని జగన్ చెప్పారు.