ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద పలాస రాజకీయాలు కాస్త తేడాగా ఉంటాయని చెప్పుకుంటారు. అందుకు తగ్గట్టే.... అసెంబ్లీ ఎన్నికల తర్వాత జిల్లా అంతా ప్రశాంతంగా ఉంటే... పలాసలో మాత్రం రాజకీయ కొలిమి రగులుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు పొలిటికల్ సెగలు పెరిగిపోతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మంటెక్కిస్తున్నారు నేతలు.
Ambati Rambabu: జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు పోలీసులు చిత్రవిచిత్రమైన ఆంక్షలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోలీసుల వేదింపులకు ఆత్మహత్యకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించనున్నారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా హాట్ కామెంట్స్ చేశారు. ఇది మంచి ప్రభుత్వం కాదని.. ముంచే ప్రభుత్వం అని విమర్శించారు. 143 హామీలతో పాటు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి.. ఒక పథకంను కూడా అమలు చేయడానికి వారికి మనసు రాలేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు సూపర్ అమలు చేశామని చెప్పడంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారన్నారు. ఒక్క పథకంను అమలు చేయకుండా, ఒక్క అభివృద్ధి పని చేయకుండా.. అన్ని చేశామని చంద్రబాబు చెప్పడంపై…
కూటమి ప్రభుత్వ నేతలు అక్రమ కేసులు పెట్టి వైసీపీ కేడర్ని వేధించాలని చూస్తున్నారని వైసీపీ పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మండిపడ్డారు. కూటమి నేతలు ఎంత అణిచివేయాలని చూస్తే.. తాము అంత పెద్దగా ఎదుగుతామన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి.. సీఎం చంద్రబాబుకు వెన్నులో వనుకు పుడుతోందన్నారు. రైతుల పరామర్శకు మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లినప్పుడు వేలాదిగా జనం తరలివచ్చారని కాకుమాను రాజశేఖర్ పేర్కొన్నారు. నేడు అమరావతిలో కాకుమాను…
ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ సొంతమైంది. ఒక ఓటు తేడాతో చైర్మన్ పీఠంను టీడీపీ దక్కించుకుంది. టీడీపీకి 16 ఓట్లు రాగా.. వైసీపీకి 15 ఓట్లు వచ్చాయి. కొండపల్లి మున్సిపల్ చైర్మెన్గా చెన్నుబోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. వైస్ చైర్మెన్గా ఇండిపెండెంట్గా గెలిచి.. టీడీపీకి మద్దతు ఇచ్చిన శ్రీదేవి ఎన్నికయ్యారు. చైర్మన్ పీఠం దక్కడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. Also Read: RK Beach: పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న నెల…
రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యల కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ జర్నలిస్టు, సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు నేడు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. కోర్టుకు సెలవులు కావడంతో గుంటూరు జిల్లా జైలులోనే కొమ్మినేని ఉన్నారు. నేడు మంగళగిరి కోర్టులో షూరిటీలు సమర్పించిన తర్వాత గుంటూరు జైలు నుంచి కొమ్మినేని విడుదల కానున్నారు. Also Read: Kondapalli Municipal Election: నేడు కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్…
నేడు ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో హైకోర్టు తీర్పు సీల్డ్ కవర్ను అధికారులు తెరవనున్నారు. కవర్లో విజేత ఎవరనేది తేలనుందా? లేక టాస్ వేయాల్సిన అవసరం వస్తుందా? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ఫలితంపై హైకోర్టు నుంచి సీల్డ్ కవర్ వచ్చి దాదాపుగా 30 రోజులు అవుతోంది. దాంతో ఛైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. గెలుపుపై ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. Also…
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.