YS Jagan: వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత!
- వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన
- కారు ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి
- వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సాయం అందజేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద కారు ఢీకొని మృతి చెందిన వెంగళాయపాలెంకు చెందిన చీలి సింగయ్య కుటుంబాన్ని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, బలసాని కిరణ్ కుమార్, నూరి ఫాతిమాలు పరామర్శించారు. అనంతరం వైసీపీ పార్టీ తరఫున 10 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును అందజేశారు. సింగయ్యను ఢీకొట్టిన వాహనం వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు గొట్టిపాటి హరీష్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించారు.
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… ‘సింగయ్య వైసీపీ కార్యకర్త, వైఎస్ జగన్ అభిమాని. జగన్ పర్యటనలో కారు యాక్సిడెంట్‌తో సింగయ్య మృతి చెందారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. విషయం తెలిసిన వెంటనే జగన్ ఆయన కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును సింగయ్య భార్యకు అందించాం. సింగయ్య మృతిని కూడా ప్రభుత్వం రాజకీయం చెయ్యాలని చూసింది. జగన్ పర్యటనపై వైసీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు కేసులు పెడుతున్నారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎవరూ భయపడరు, వాటిపై న్యాయపోరాటం చేస్తాం. వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా నిర్బంధిస్తే చూస్తూ ఊరుకోం. జగన్ పర్యటనకు ప్రజలను రానివ్వకుండా చేయాలని ప్రభుత్వం, పోలీసులు ద్వారా కుట్ర పన్నింది. ఆ కుట్రను ఛేదించుకుంటూ వేలాది మంది జనం తరలివచ్చారు’ అని అన్నారు.
Also Read
Also Read: MLC Naga Babu: జనం గట్టిగా బుద్ధి చెప్పారు.. అయినా దాష్టీకం ప్రదర్శిస్తూనే ఉన్నారు!
‘సింగయ్య వైసీపీకి కరుడుగట్టిన కార్యకర్త. యాక్సిడెంట్‌లో ఆయన చనిపోవడం బాధాకరం. ఈ విషయం తెలుసుకోగానే వైఎస్ జగన్ మమ్మల్ని అందరినీ సింగయ్య ఇంటికి వెళ్లి ఆ కుటుంబానికి అండగా ఉండమని ఆదేశించారు. జగన్ పంపిన 10 లక్షలు ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ఆ కుటుంబానికి అందించాం. సింగయ్య కుటుంబానికి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుంది’ అని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?