Yasin Malik: ఉగ్రవాద నిధుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్(JKLF) ఉగ్రవాది యాసిన్ మాలిక్ సంచలన విషయాన్ని వెల్లడించారు. 2006లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా(LeT) చీఫ్, 26/11 దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను కలిసిన తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తనకు వ్యక్తిగతంగా థాంక్స్ చెప్పారని వెల్లడించారు.
Manmohan Singh: భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పథంలో నడిపిన రూపశిల్పి, 10 ఏళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. భారతదేశం దివాళా తీసే స్థితి నుంచి ఇప్పుడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందంటే ఇందులో మన్మోహన్ కృషి మరవలేనిది. 1991 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆర్థిక మంత్రిగా అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. భారత మార్కెట్‌ని లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ చేయడానికి ఆయన ఎన్నో చర్యలు…
వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది
Supreme Court: ఈ రోజు (గురువారం) వేర్పాటు వాది యాసిన్ మాలిక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఉగ్ర దాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని తెలిపింది.
Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాద నేత, పలు ఉగ్రవాద ఘటనలో సంబంధం ఉన్న యాసిన్ మాలిక్ తాను 1994 నుంచి హింసను విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. ఐక్య, స్వతంత్ర కాశ్మీర్ కోసం తాను గాంధేయ మార్గాన్ని అనుసరిస్తున్నానని చెప్పారు.
Terrorist Yasin Malik: కాశ్మీర్ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్ మాలిక్‌కి మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ హైకోర్టలో అప్పీల్ చేసింది. అయితే, ఈ దర్యాప్తు నుంచి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ శర్మ గురువారం తప్పుకున్నారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌తో పాటు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే కార్యకలాపాల్లో జేకేఎల్‌ఎఫ్ (యాసిన్ మాలిక్ వర్గం) నిమగ్నమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Yasin Malik: టెర్రర్ ఫండిగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాది యాసిన్ మాలిక్ కు మరణశిక్ష విధించాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఈ కేసులో యాసిన్ మాలిక్ కు జీవితఖైదు పడింది. ఇదిలా ఉంటే ఢిల్లీ హైకోర్టు సోమవారం యాసిన్ మాలిక్ కు నోటీసు జారీ చేసింది. న్యాయమూర్తులు సిద్ధార్థ్ మృదుల్ మరియు తల్వంత్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆగస్టు 9న మాలిక్‌ను తమ ముందు హాజరుపరచాలని వారెంట్లు జారీ చేసింది.
ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న నిషేధిత జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తీహార్ జైలులో శుక్రవారం(జులై 22) నుంచి నిరాహార దీక్ష ప్రారంభించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఆయన కేసును సరైన రీతిలో విచారించడం లేదని ఆరోపిస్తూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నాడు.