Work From Home: తమ రాష్ట్రంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు రాజస్థాన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పిస్తామని సీఎం అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. జనాధార్ కార్డు ద్వారా మహిళలు ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవచ్చని అధికారులు సూచించారు.…
యూజర్లకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని మెసెంజర్ యాప్‌లు ఉన్నా యూజర్లు వాట్సాప్ వాడటాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పేమెంట్స్ వంటి ఫీచర్లను కూడా వాట్సాప్ ప్రవేశపెట్టింది. తాజాగా మహిళల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళలు తమ నెలసరిని సులువుగా ట్రాక్ చేసేందుకు వీలుగా సిరోనా హైజెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. దేశంలో తొలిసారిగా వాట్సాప్…
చిత్తశుద్ధి లేకుండా చట్టాలు చేసి ప్రచారం చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మహిళలకు మాత్రం రక్షణ ఇవ్వలేకపోతోంది.రేపల్లె రైల్వే స్టేషన్ లో మహిళా వలస కూలీపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచార ఘటన అత్యంత బాధాకరం అన్నారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. పొట్ట కూటి కోసం వలస వచ్చిన కుటుంబానికి ఎదురైన ఈ దిగ్భ్రాంతికర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిగజారుతున్న శాంతి భద్రతల పరిస్థితిని తెలియచేస్తోందని ఎద్దేవా చేశారు. గత పది రోజులుగా రాష్ట్రంలో వరుసగా ఇలాంటి…
ప్రతి స్త్రీ జీవితంలో రుతుక్రమం ప్రధానమయింది. తెలంగాణ అభివృద్ధిలో మహిళల పాత్ర ముఖ్యమైందన్నారు ఆర్థిక, వైద్యమంత్రి తన్నీరు హరీష్ రావు. సిద్ధిపేట 5వ వార్డులో పరిశుభ్రతలో భాగంగా ‘ఋతు ప్రేమ’ పైలట్ ప్రాజెక్టుగా మార్గనిర్దేశక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రుతు ప్రేమ అనేది మాట్లాడానికి జుగుప్సాకరంగా ఉంటుంది. నేడు మనం మొదటి మెట్టు ఎక్కాం అంటే మీ మహిళల సహకారం వల్లనే. వీటి వాడకం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు, డబ్బు వృధా కాదు. ఇది ప్రపంచంలో…
నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా విడుదలయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. తన నటనతో మరోసారి బాలకృష్ణ అంటే ఏంటో చూపించారు. కరోనా, ఓటీటీల కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న అనుమానం ప్రొడ్యూసర్లలో ఉండేది. కానీ బాలయ్య ఒక్క సినిమాతో ఆ అనుమానాన్ని పటా పంచలు చేశారు.…
తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది. ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి.…
డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగ్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందన్నారు. జగన్ వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒక్కటీ చేసేదీ ఒక్కటీ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి కే ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తిగా నేరవేర్చలేదని నారాలోకేష్ అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం…
అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. స్థానికంగా పౌర హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు, పాత్రికేయులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. మహిళల పరిస్థితి దీనంగా మారింది. తమను తాలిబన్లు వేటాడుతున్నారంటూ, ప్రాణభయం ఉందంటూ చాలామంది ఇది వరకే వాపోయారు. కొందరు దేశం విడిచిపెట్టి వెళ్లిపోయారు. తాజాగా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మహిళా హక్కుల కార్యకర్త ఫ్రోజన్ సఫీతో సహా నలుగురు మహిళలను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. బాల్ఖ్ ప్రావీన్స్‌లోని మజారే షరీఫ్‌లో వీరు హత్యకు గురయ్యారు. ఓ…