డ్వాక్రా మహిళలకు జగన్ టోకరా వేశారాని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగ్ ప్రభుత్వం మహిళలను మోసం చేస్తుందన్నారు. జగన్ వన్‌టైం సెటిల్మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ చేశారన్నారు. ప్రభుత్వం చెప్పేది ఒక్కటీ చేసేదీ ఒక్కటీ అని ఎద్దేవా చేశారు. ఇప్పటి కే ఇచ్చిన హామీల్లో ఏవీ పూర్తిగా నేరవేర్చలేదని నారాలోకేష్ అన్నారు. ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్ సర్కార్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
జగన్ రెడ్డి కంబధహస్తాల్లో చిక్కిన అభయ హస్తంమని ఎద్దేవా చేశారు. ప్రజలను ఇబ్బందులు పెట్టే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకున్నా దానిపై టీడీపీ పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. వన్‌టైమ్ సెటిల్మెంట్‌ను ఎవ్వరూ కట్టొద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత రిజిస్ర్టేషన్లను ప్రారంభిస్తామిని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా జగన్ సర్కార్ బుద్ధి తెచ్చుకుని నడుచుకోకుంటే పతనం తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.