మహిళలపై అత్యాచారాలు వెలుగుచూసిన సమయంలో చాలాసార్లు వాళ్లు ధరించే దుస్తులపై మీడియాలో చర్చలు జరుపడం చూస్తూనే ఉంటాం. ఒకవర్గం మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచిస్తుంటారు… మరోవర్గం వారు ఏది కంఫార్ట్ గా ఉంటే అవే ధరించాలని వాదిస్తూ ఉంటారు. మధ్యేమార్గంగా మరికొందరు మహిళల ఇష్టాలను కాలారాసే శక్తి ఎవరికీ లేదని.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వారికే మంచిదని సూచిస్తూ ఉంటారు. ఇలా ఎవరికీవారు వారికి తోచినవిధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది కేవలం మనదేశానికే పరిమితం కాకుండా…
టీడీపీపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. చంద్రబాబు వల్లే ఏ గ్రేడ్‌లో ఉన్న మహిళ సంఘాలన్నీ ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయన్నారు. గత ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి…చేతులెత్తేసిందన్నారు. రుణాలు కట్టొద్దని పిలుపునిచ్చి మహిళలను మోసం చేసిందని ఆరోపించారాయన. వడ్డీలు చెల్లించలేక తడిసి మోపెడయ్యాయని, 2014లో చంద్రబాబు మహిళల రుణాలను మాఫీ చేసి ఉంటే అక్కడితో భారం పోయేదన్నారు జగన్. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని పాదయాత్రలో కోరారని అందుకే ఆసరా, చేయూత పథకాలను తెచ్చామన్నారు.…
రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా యూపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఏ బస్సులోనైనా, ఎప్పుడైనా ఉచితంగా ప్రయాణించేలా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. 21 ఆగస్ట్ అర్ధరాత్రి నుంచి 22 ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని ఉత్తర్వుల్లో తెలిపింది. మహిళలు అన్ని రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని UPSRTC పేర్కొంది. పింక్ టాయిలెట్ల నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని…
కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ హింస ఫిర్యాదులే దీనికి నిదర్శనం. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక…