కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది..ముఖ్యంగా మహిళలకు ఇది గుడ్ షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.. ఇండో -టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ లో హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) – గ్రూప్ ‘సి’ పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది..ఈ ఉద్యోగాల పై ఆసక్తి కలిగిన మహిళలు జూన్ 9 నుంచి అధికారిక వెబ్‌సైట్ recruitment.itbpolice.nic.in లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోగలరు. ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 8. ఈ పోస్ట్ లు నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ గ్రూప్ 2 ఉద్యోగాల కేటగిరీలోకి వస్తాయి… గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ పోస్టులను విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్తుంది..
ఖాళీలు :
మొత్తం 81 హెడ్ కానిస్టేబుల్ (మిడ్ వైఫ్) పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో 34 జనరల్ కేటగిరీకి, 22 ఓబీసీలకు, 12 ఎస్సీలకు, 6 ఎస్టీలకు, 7 ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వ్ చేశారు. వయో పరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు మూడేళ్లు మినహాయింపునిచ్చారు..
జీతం :
రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ITBP గ్రూప్ ‘C’ (నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్)లో మహిళా హెడ్ కానిస్టేబుల్స్ (మిడ్‌వైఫ్) కోసం మొత్తం 81 ఖాళీలను భర్తీ చేస్తారు. పే స్కేల్ లెవల్ 4 వారికి జీతం రూ. 25,500-81,100 ఉంటుంది..
వయోపరిమితి:
జూలై 8, 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హత:
అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుండి సహాయక నర్సింగ్ మిడ్‌వైఫరీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి…
ఇంటర్వ్యూ విధానం :
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాతపరీక్ష.. ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి అప్లై చేసుకోగలరు..