నందమూరి బాలకృష్ణ నటించిన సినిమా అఖండ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమా విడుదలయినప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. తన నటనతో మరోసారి బాలకృష్ణ అంటే ఏంటో చూపించారు. కరోనా, ఓటీటీల కారణంగా థియేటర్లకు జనాలు వస్తారో రారో అన్న అనుమానం ప్రొడ్యూసర్లలో ఉండేది. కానీ బాలయ్య ఒక్క సినిమాతో ఆ అనుమానాన్ని పటా పంచలు చేశారు.
మంచి సినిమా పడితే ప్రేక్షకులు వారంతటా వారే చిన్న పెద్ద అనే తేడా లేకుండా తన సినిమాను చూసేందుకు వస్తారని మరోసారి బాలయ్య నిరూపించారు. కరోనా కారణంగా అంతంత మాత్రంగా నడుస్తున్న థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని అఖండ సినిమాను చూసేందుకు మహిళలు ట్రాక్టర్లలో రావడం విశేషం. ప్రేక్షకులు ఇలా రావడం చూసి ఎన్ని రోజులైందో అని నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఒక్క బాలయ్యబాబుకే సాధ్యమని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా ఈసినిమాను బోయపాటి శ్రీను డైరెక్టర్ చేశారు. యాక్షన్ డ్రామా సెంటిమెంట్‌తో సిని ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.