Tamilisai:మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం సోమవారం ఆమోదం తెలిపింది.
Women Reservation Bill: ఐదు రోజుల పాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొత్త సెషన్ ప్రారంభం కాకముందే.. మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు.