CM YS Jagan: మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు.. సీఎం జగన్ స్పందన ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కీలక ముందడుగు వేసింది ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్.. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. సోమవారం సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం విదితమే కాగా.. ఈ రోజు ఈ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. నారీ శక్తి వందన్ అభియాన్ పేరుతో కేంద్రం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అయితే దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.. ఇక, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. బిల్లును స్వాగతిస్తూ ట్వీట్ చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వటానికి గర్విస్తున్నాను అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. మాకు అత్యంత ప్రాధాన్యత అంశం మహిళా సాధికారత.. గత నాలుగేళ్లుగా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు, సమాన ప్రాతినిధ్యం ద్వారా మహిళా సాధికారత సాధించామని.. మరింత ఉజ్వలం భవిష్యత్తు, మరింత సమానత్వం సాధిద్ధాం అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
I am proud to extend @YSRCParty’s support to the #WomenReservationBill.
Empowering our women is of utmost importance to us. We achieved this in Andhra Pradesh not only through the schemes and initiatives introduced in the past 4 years, but also by ensuring equitable…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 19, 2023
మరోవైపు ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళా కోసం జగన్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. మహిళలకు నామినేటెడ్ , స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అయితే, మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై అధ్యయనం చేసి బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూస్తామని.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో 6 గంటల పాటు చర్చ ఉంటుందన్నారు. అంశాలపై విభేదాలు రావచ్చు ఏమో కానీ అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలుపుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!