Asaduddin Owaisi: కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ విరుచుకుపడ్డారు. ఇది కేవలం "సవర్ణ మహిళల"(అగ్రకుల మహిళలు) కోసమే ప్రవేశపెట్టిన బిల్లుగా అభివర్ణించారు. ఓబీసీ మహిళలకు, మహిళా కోటాలో రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్రం తీరును తప్పుపట్టారు. ఎంఐఎం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని చెప్పారు. మహిళా బిల్లును ‘‘చెక్ బౌన్స్ బిల్లు’’, ‘‘ఓబీసీ, ముస్లిం మహిళ వ్యతిరేక బిల్లు’’గా విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాడివేడి చర్చ సందర్భంగా బుధవారం మహిళా ఎంపీల పేలుడు ప్రసంగాలతో కొత్త పార్లమెంట్ ప్రతిధ్వనించింది. మాజీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీకి చెందిన సుప్రియా సూలే మహిళలను గౌరవించడంలో విఫలమయ్యారని ప్రభుత్వంపై విరుచుకుపడగా.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ ప్రభుత్వం మహిళలను లెక్కించిందని, గౌరవించిందని ప్రకటించారు.
Amit Shah: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలు కేంద్ర తీసుకువచ్చని బిల్లును స్వాగతిస్తూనే, ఓబీసీ రిజర్వేషన్ పై పట్టుబడుతున్నాయి. మరోవైపు ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. బిల్లు తీసుకురావడం మంచిదే కానీ, తీసుకువచ్చిన సమయంపై పలువరు ప్రతిపక్ష నేతలు ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు.
లోక్‌సభలో బుధవారం జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చలో పాల్గొన్న సమాజ్‌వాదీ పార్టీ సభ్యురాలు డింపుల్ యాదవ్.. ఇతర వెనుకబడిన కులాలు, మైనారిటీలకు చెందిన మహిళలు దాని నుంచి ప్రయోజనం పొందడం చాలా ముఖ్యమని అన్నారు.
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు కకోలి ఘోష్ దస్తిదార్ బుధవారం బీజేపీపై విరుచుకుపడ్డారు. 16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేరని ఆమె విమర్శలు గుప్పించారు.
Women Reservation Bill: పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే చర్చలో భాగంగా బీజేపీ ఎంపీ నిశీకాంత్ దూబే, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సంచలన ఆరోపణలు చేశారు. 2012లో ఎస్సీ,ఎస్టీ రిజర్వేష్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన వివాదాన్ని ఆయన గుర్తు చేశారు. వి నారాయణ స్వామి బిల్లు పెడుతున్న సమయంలో ఎస్సీ/ఎస్టీల ప్రమోషనల్ కోటాపై బిల్లు పెడుతున్న
Women’s Reservation Bill: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని రామచంద్రపురం పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు డాక్టర్ సి అంజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు గోదావరి అంజిరెడ్డి, పలువురు మహిళలు పాలాభిషేకం నిర్వహించారు.
Rajasthan Assembly Election: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ చట్టం లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందితే.. పలు రాష్ట్రాల అసెంబ్లీల చిత్రణ పూర్తిగా మారిపోతుంది.