Minister KTR: గిరిజన బిడ్డగా చొరవచూపి గిరిజనుల రిజర్వేషన్ల కోసం కేంద్రాన్ని ఒప్పించాలని మంత్రి కేటీఆర్ ద్రౌపది ముర్మును కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు విజ్ఞప్తి చేశారు. జాతి నిర్మాణంలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని.. అందుకు తామెంతో గర్విస్తున్నామన్నారు. తెలంగాణ పల్లెల్లో ఎక్కడా విద్యుత్ గోసలు లేవన్నారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి స్వీకరించిన రోజే ఆమె సొంత ఊరుకు కరెంట్ వచ్చిందని.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నారు.
గిరిజన రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉందని తెలిపిన మంత్రి కేటీఆర్.. రాష్ట్రం పంపిన తీర్మానాన్ని అమలు చేసేలా చూడాలని ద్రౌపది ముర్మును కోరారు. పోడు భూముల విషయంలో కేంద్రం కటాఫ్ డేట్ మార్చే విధంగా రాష్ట్రపతి చొరవ చూపాలన్నా్రు. మారిన జనాభా శాతం ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ శాతం పెంచుకునేందుకు అవకాశం కల్పించేందుకు రాష్ట్రపతి కృషి చేయాలని కోరారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన దానికంటే, కేంద్రానికి తెలంగాణ ఇచ్చింది ఎన్నోరెట్లు ఎక్కువని ఆయన అన్నారు. భాజపా నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మంచిదికాదని, ఇప్పటికైనా మార్చుకోకపోతే చూస్తూ ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలకు తావులేకుండా అందరు మహానుభావుల విగ్రహాలు సిరిసిల్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని విగ్రహాలు ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేస్తామన్నారు. తెరాసపై ఉన్న కోపాన్ని తెలంగాణ ప్రజలపై చూపొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
Rains Continue: వదలనంటున్న వాన.. హై అలర్ట్
ఆదర్శగ్రామాలు తెలంగాణలోనే ఉన్నాయని కేంద్రమే చెప్పిందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. . మేము తెలంగాణకు ఏదో ఇస్తున్నామని మాట్లాడుతున్నారని.. 8 ఏళ్లలో తెలంగాణకు దేశం ఇచ్చింది తక్కువ… దేశానికి తెలంగాణ ఇచ్చింది ఎక్కువని ఆయన అన్నా్రు.