పశ్చిమబెంగాల్లో కల్తీసారా ఏడుగురిని కబళించింది. హౌరాలో కల్తీసారా సేవించి 7 మంది మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. హౌరాలో ఓ బస్తీలో ఈ ఘటన జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి. తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు…
పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇదిలా ఉంటే మరో కొత్త వ్యాధి బెంగాల్ ను ఆందోళన పరుస్తోంది. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కోల్‌కతా నగరంలో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల్లో బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్లు కలుగుతుంది. ఇప్పటి వరకు బెంగాల్ వ్యాప్తంగా 10 మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్దారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు. దీంతో బెంగాల్ లో…
కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో అందరికి తెలిసిందే. యజమాని చెప్పిన మాట వింటూ నమ్మకంగా ఉంటాయి. ఒక్కో సారి యజమాని కష్ట సమయాల్లో ఉన్నప్పుడు కాపాడిన కుక్కల గురించి చాలా కథలు విన్నాం. తాజాగా అలాంటి ఘటనే మరోసారి కోల్‌కతాలో జరిగింది. దొంగ బారి నుంచి కుటుంబాన్ని కాపాడటమే కాకుండా.. దొంగను పట్టించింది. దక్షిణ కోల్‌కతాలోని కాళీఘాట్ ప్రాంతంలోని జాదు భట్టాచార్య లైన్ లో ఓ ఇంట్లో దొంగ చొరబడ్డాడు. సదరు ఇళ్లు బెంగాల్ సీఎం ఇంటికి…
ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉదయ్‌పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముస్లిం సంస్థలు సహా ప్రతిఒక్కరూ ఈ ఘటనని ఖండిస్తున్నారు. ఇప్పుడు ఈ ఉదంతంపై టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. హింస, ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని.. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. చట్టం తన పని చేసుకుపోతుందన్న ఆమె.. ప్రతి ఒక్కరినీ శాంతిని కాపాడాలని కోరుతూ ట్వీట్ చేశారు. మరోవైపు.. మంగళవారం…
పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ గతంలో ఐపీఎల్ ద్వారా క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం ఉన్నవాడే. క్రీడల మంత్రిగా పనిచేస్తున్నా ఆయన మాత్రం ఇంకా క్రికెట్ ఆడుతూ తనలో ఇంకా ఆడే సత్తా ఉందని నిరూపిస్తున్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు బాది అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. మంత్రి పదవితో బిజీగా ఉన్నా ఇంకా క్రికెట్‌పై దృష్టి పెట్టడం అంటే మాములు మాటలు కాదు. ఈ సందర్భంగా అటు మంత్రి…
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలను కలుగచేశాయి. ఢిల్లీ నుంచి మొదలుకుని ఉత్తర్ ప్రదేశ్, రాంచీ, హైదరాబాద్, హౌరా ఇలా పలు ప్రాంతాల్లో ముస్లింల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. జార్ఖండ్ రాంచీలో అల్లర్లలో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో నిరసన పేరుతో అల్లర్లకు పాల్పడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆస్తి నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో బీజేపీ ఆఫీసులను దగ్ధం చేశాయి అల్లరిమూకలు. ఇదిలా ఉంటే అల్లర్లపై…
మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ శుక్రవారం దేశవ్యాప్తంగా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. దేశంలోని నగరాలు, పట్టణాల్లో భారీ ప్రదర్శనలు నిర్వహించారు. భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌శర్మ, నవీన్ కుమార్ జిందాల్‌ను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో బెంగాల్లో రెండో రోజు కూడా అల్లర్లు జరిగాయి. హౌరా…
రంజీ ట్రోఫీలో భాగంగా బెంగాల్, జార్ఖండ్‌ల మధ్య జరిగిన క్వారర్ ఫైనల్ మ్యాచ్ శుక్రవారం డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఫలితం వచ్చేలా కనిపించకపోవడంతో అంపైర్లు గంట ముందుగానే మ్యాచ్‌ను నిలిపివేసి డ్రాగా ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ సెంచరీ చేయడం విశేషం. 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన బెంగాల్‌ను మనోజ్ తివారీ తన…
బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని, 2024 ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పురూలియాలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించార. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోదని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ‘కల్తీ’గా అభివర్ణించారు. నోట్ల రద్దు,…