West Bengal youth addiction to condoms: సాధారణంగా హెచ్ఐవీ లాంటి వ్యాధుల నుంచి రక్షణ పొందేందుకు లైంగిక జీవితంలో కండోమ్స్‌ను వాడుతుంటారు. కొందరు భార్యాభర్తలు మాత్రం పిల్లలు పుట్టకుండా ఉపయోగిస్తుంటారు. కానీ పశ్చిమ బెంగాల్‌లో యువత వీటిని ఎందుకు వాడుతుందో తెలిస్తే షాకవుతారు. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ ప్రాంతానికి చెందిన యువకులు తమకు సమీపంలోని మెడికల్ స్టోర్స్‌కు వెళ్లి పెద్ద ఎత్తున కండోమ్ ప్యాకెట్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన కండోమ్‌లను వేడి నీటిలో రాత్రంతా నానబెడుతున్నారు. తర్వాత కండోమ్‌లను పక్కన పడేసి ఆ నీళ్లను తాగి మత్తులో తూగుతున్నారు. దీంతో ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Read Also: Somireddy Chandramohan Reddy: వాళ్లు ఆఫ్రికాతో పోలుస్తారు.. మేం శ్రీలంకతో పోలిస్తే బుకాయిస్తారు
అయితే సదరు యువకులు ఇందుకు ఎలా చేస్తున్నారని ఆరా తీయగా కండోమ్‌లను సుమారు 5-6 గంటలు నీటిలో నానబెట్టిన తర్వాత ఆ నీళ్లకు ఆల్కహాలిక్ స్వభావం వస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఎక్కువగా కాలేజీ స్టూడెంట్లు ఈ నీటికి బానిసలుగా మారుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఎవ్వరికీ అనుమానం రాకుండా కోడ్ లాంగ్వేజీలు ఉపయోగించి మరీ యువకులు పెద్ద మొత్తంలో కండోమ్‌లను కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మత్తులో తూలాలంటే ఆల్కహాల్ కొనుగోలు చేస్తే సరిపోతుంది కదా.. అంతదానికి కండోమ్‌లు కొనుగోలు చేసి మరీ ఈ పనికి పాల్పడాలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. యువకులు ఇలా చేయడం వెనుక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.