West Bengal: ఇక, బెంగాల్ వంతు..? బీజేపీతో టచ్‌లోకి 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ జనతా పార్టీ నేత మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో చర్చగా మారాయి.. అసలే, తమకు సరైన మెజార్టీ లేని రాష్ట్రాల్లోనూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ.. అప్రజాస్వామిక పద్దతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలను కూల్చివేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్న సమయంలో.. కోల్‌కతాలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత మిథున్ చక్రవర్తి.. మీరు బ్రేకింగ్ న్యూస్ వినాలనుకుంటున్నారా? మతో 38 తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంచి సంబంధాలు కలిగి ఉన్నారు.. వారిలో 21 మంది ప్రత్యక్షంగా టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు.. దీనిపై మీడియా మళ్లీ మళ్లీ ప్రశ్నించగా.. ట్రైలర్‌ను విడుదల చేయమని నన్ను అడగవద్దు, సంగీతాన్ని ఆస్వాదించండి అని వ్యాఖ్యానించారు.
Read Also: New Twist in Saipriya Case: మరోసారి ఝలక్ ఇచ్చిన సాయిప్రియ..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు “ఆపరేషన్ లోటస్” ప్లాన్ చేస్తోందని మమతా బెనర్జీ ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత మిథున్ చక్రవర్త ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.. అయితే, రెండు రోజుల క్రితం, మమతా బెనర్జీ.. బీజేపీకి సవాలు విసిరారు, శివసేనలో తిరుగుబాటు తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పతనం కావడం గురించి ప్రస్తావిస్తూ, ఇందులో బీజేపీ సహాయక పాత్ర పోషించిందని.. బీజేపీ ఎజెండాలో తన రాష్ట్రం తర్వాతి స్థానంలో ఉందని చెప్పారు. మహారాష్ట్ర ఈసారి యుద్ధం చేయలేకపోయింది. మహారాష్ట్ర తర్వాత ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ మరియు బెంగాల్ అంటున్నారని.. కానీ, ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి.. మీరు బంగాళాఖాతం దాటాలి.. మొసళ్ళు మిమ్మల్ని కొరుకుతాయి.. రాయల్ బెంగాల్ టైగర్ మిమ్మల్ని కొరికేస్తుంది.. ఉత్తర బెంగాల్‌లో ఏనుగులు మీపైకి దొర్లుతాయి అంటూ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
బెంగాల్‌లో తనను గద్దె దించేందుకు బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. గత సంవత్సరం, రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో అన్ని వనరులను మరియు దాని అగ్ర నాయకులను దింపినా.. కఠినమైన సవాలుతో పోరాడిన తర్వాత ఆమె బెంగాల్‌లో మూడవసారి సీఎం సీటును అధిష్టించారు.. కాగా, మిథున్ చక్రవర్తి గత సంవత్సరం ఎన్నికలకు ముందు చాలా ఆర్భాటాలతో బీజేపీలో చేరారు, అయితే, సినీ నటుడిగా బెంగాల్‌లో భారీ ప్రజాదరణ ఉన్నప్పటికీ ఓటర్లపై తగినంత ప్రభావం చూపలేకపోయారు. మరోవైపు మిథున్ చక్రవర్తి కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు టీఎంసీ ఎంపీ డోలా సేన్..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!