Intimate toys recovered from Arpita Mukherjee’s flat: పశ్చిమ బెంగాల్ రాజకీయాలతో పాటు త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీని మంత్రి పార్థ ఛటర్జీ వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ లో ఈడీ పార్థ ఛటర్జీ సన్నిహితు ఇళ్లపై దాడులు చేశారు. పార్థఛటర్జీ సన్నిహితురాలిగా ఉన్న అర్పితా ముఖర్జీ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈడీ కళ్లు బైర్లకమ్మేలా.. ఏకంగా 50 కోట్ల నగదుతో పాటు కిలోల కొద్ది బంగారం బయటపడింది. మొత్తం రూ.2000, రూ.500 నోట్లు కట్టలు కట్టలుగా లభించాయి. వీటిని లెక్కించడానికి ఏకంగా కౌంటింగ్ మిషన్లు, బ్యాంకు ఉద్యోగులును ఈడీ ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ పెద్ద ట్రక్కులో డబ్బును ఈడీ తరలించాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదిలా ఉంటే.. ఇప్పుడు మరో విషయం ఈడీని షాక్ కు గురిచేసింది. అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి ‘సెక్స్ టాయ్స్’ దొరకడం సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై కూడా ఈడీ అర్పితా ముఖర్జీని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అర్పితా ముఖర్జీ ఫ్లాట్ లో దొరికిన సెక్స్ టాయ్స్ ను ఎవరు ఇచ్చారు.. ఎవరు తీసుకువచ్చారు.. వాటిని ఎందుకు ఉపయోగించారు.. ఆన్ లైన్లో కొనుగోలు చేశారా..? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఫ్లాట్ నుంచి ఓ వెండి గిన్నెను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే బెంగాల్ సమాజంలో కొత్తగా పెళ్లయిన జంటకు వెండిగిన్నెలు ఇచ్చే సంప్రదాయం ఉంది. ఇవి అర్పితా ఫ్లాట్ కు ఎలా వచ్చాయో తెలియాల్సి ఉంది.
Read Also: Samantha: చైతూతో ఉన్న ఇంటిని డబుల్ రేటుకు కొనుగోలు చేసిన సమంత.. కారణం ఇదేనా?
ఈ సెక్స్ టాయ్స్ ద్వారా.. పార్థఛటర్జీ- అర్పితా ముఖర్జీ మధ్య వ్యక్తిగత జీవితం బయటకు వచ్చే అవకాం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై బెంగాల్లో పలువురు నెటిజెన్లు స్పందిస్తున్నారు. ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. నటి శ్రీలేక మిత్ర, అర్పితా ముఖర్జీ ఫ్లాట్ లో సెక్స్ టాయ్స్ దొరికిన తరువాత ట్విట్టర్ వేదికగా సెటైరికల్ కామెంట్స్ చేసింది.‘‘ ఆహారే.. పార్థబాబు కోరిక తీర్చలేదా..? వయస్సు అడ్డంకి కాదు..కులం అడ్డంకి కాదు..పార్థ వ్యవహారంపై మదేశం తెలుసుకోవాలనుకుంటుంది’’ అంటూ ట్వీట్ చేసింది.