బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ గట్టి షాకిచ్చింది. నందిగ్రామ్‌లోని ఓ సహకార సంఘానికి జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో బీజేపీ తలపెట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బెంగాల్ రణరంగాన్ని తలపించింది. పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు తీవ్రస్థాయిలో చెలరేగాయి. నడి రోడ్లపై రాళ్లు రువ్వడం, కట్టెలతో దాడి చేసుకోవడం, టార్గెట్ చేసుకుని దాడి చేయడం వంటివి చాలా చోట్ల కనిపించాయి.
Nabanna Abhiyan march in west bengal: పశ్బిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి హింస చెలరేగింది. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. 2021 ఎన్నికల తర్వాత బీజేపీ మంగళవారం ‘నబన్న అభియాన్’ పేరుతో పెద్ద ఎత్తున సెక్రటేరియట్ మార్చ్ కు పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు కోల్‌కతా చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసులు ఎక్కడికక్కడ వీరిని అడ్డుకున్నారు.
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరుచోట్ల నిర్వహించిన దాడుల్లో సుమారు రూ.7కోట్ల నగదు బయటపడింది. మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నట్లు నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా యాప్ ప్రమోటర్లపై ఈడీ దర్యాప్తు చేపట్టింది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేసిన వేళ అమిత్ షాను 'ఇండియాలోనే అతిపెద్ద పప్పు' అని కామెంట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
CBI Raids Bengal Law Minister In Coal Scam Case: మరో పశ్చిమ బెంగాల్ మంత్రి నివాసాలు, కార్యాలయాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్( సీబీఐ ) అధికారులు దాడులు చేశారు. బొగ్గు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు జరిగాయి. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రిగా ఉన్న మోలోయ్ ఘటక్ మూడు ఇళ్లపై, కార్యాలయాతో పాటు మొత్తం ఏడు చోట్ల సీబీఐ అధికారులు దాడులు చేశారు. అసన్సోల్, కోల్‌కతా సహా రాష్ట్రవ్యాప్తంగా ఏడు చోట్ల…
National Green Tribunal: తడి చెత్త, పొడి చెత్త వేరుచేయడం వంటి నిర్వహణలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జాప్యం చేయడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో రెండు నెలల్లో రూ.3500 కోట్లు జరిమానా చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. గడువు దాటితే అదనపు జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. 2022-2023 రాష్ట్ర బడ్జెట్ ప్రకారం పట్టణాభివృద్ధి, మున్సిపల్ వ్యవహారాలపై రూ.12,818.99 కోట్లు కేటాయించినప్పటికీ మురుగునీరు, ఘన వ్యర్థ పదార్థాల…
Mamata Banerjee praised RSS.. Criticized by the opposition: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు మద్దతుగా పశ్చిమ బెంగాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఆర్ఎస్ఎస్లో అందరూ చెడ్డవారు కాదని.. బీజేపీకి మద్దతు ఇవ్వని వారు కూడా చాలా మంది ఉన్నారని త్రుణమూల్ అధినేత్రి అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, వామపక్షాలు, ఎంఐఎం పార్టీలు దీదీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నాయి. అయితే ఆర్ఎస్ఎస్ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదు.. బెంగాల్ లో జరిగిన రాజకీయ…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా…
Suvendu Adhikari comments on TMC government: బీజేపీ నేత సువేందు అధికారి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఆరు నెలులు కూడా బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉండదని ఆయన గురువారం వ్యాఖ్యానించారు. అధికార టీఎంసీ ‘ కొత్త, సంస్కరించిన టీఎంసీ’ ఆరు నెలల్లో వస్తుందని పోస్టర్లు వేసిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.