Mamata Banerjee on Partha Chatterjee Case: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ వ్యవహారంలో తవ్వినా కొద్ది నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంటిలో రూ.21 కోట్లు పట్టుబడగా.. నిన్న మరో రూ.29 కోట్లు, 5 కేజీల బంగారం పట్టుబడింది. దీంతో ఆయన ఎంతపెద్ద స్కామ్ చేశాడో అర్థం అవుతోంది. ఇటీవల ఈడీ చేసిన సోదాల్లో మంత్రి సన్నిహిరాలి ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు బయటపడింది. దీంతో పార్థఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
ఇదిలా ఉంటే మంత్రి పార్థ ఛటర్జీ వ్యవహారం, స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్ పై సీఎం మమతా బెనర్జీ మరోసారి స్పందించారు. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని తమ పార్టీకి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రచారం ప్రారంభించారని విమర్శించారు. కోర్టులో దోషులుగా రుజువైతే శిక్షించాలి.. కానీ రాజకీయ పార్టీని కించపరచడానికి ఏజెన్సీలను ఉపయోగించకూడదని హితవుల పలికారు. పెద్ద సంస్థలను నడుపుతున్నప్పుడు తప్పులు ఉండవచ్చని.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ప్రజలకు తప్పులు చేసే హక్కు ఉందని చెప్పాడని.. మమతా బెనర్జీ అన్నారు. కానీ మీడియా మాత్రం దోషిగా తేలకుముందే విష ప్రచారం చేస్తుందని..దీనికి నేను వ్యతిరేకం అని మమతా బెనర్జీ అన్నారు. మీడియా ఓ వ్యక్తి చట్టబద్ధంగా దోషిగా తేలకముందే.. కోర్టుల వలే వ్యవహరించి తీర్పులు చెప్పేందుకు ప్రయత్నిస్తాన్నాయంటూ.. మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Arpita Mukherjee: మళ్లీ భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు..! నా ఇంట్లో ఛటర్జీ డబ్బులు దాచేవారు..
ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మీడియా కంగారూ కోర్టుల పాత్ర పోషిస్తుందంటూ వ్యాఖ్యానించారని ఆమె గుర్తు చేవారు. బెంగాల్ లో అభివృద్ధి జరగకూడదని.. రాష్ట్ర పరువు తీయాలని బీజేపీ కోరుకుంటోందని ఆమె విమర్శించారు. ఎజెండాతో నడిచే మీడియా ప్రజాస్వామ్యానికి హానికరమని ఇటీవల చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసి వ్యాఖ్యలను మమతా బెనర్జీ ప్రస్తావించారు. దర్యాప్తు సంస్థలు తమ పనిని చేయడం వల్ల తమకు ఇబ్బంది లేదని.. అయితే దర్యాప్తు పేరుతో ఏ రాజకీయ పార్టీని నాశనం చేయాలనుకున్నా సహించేది లేదని దీదీ అన్నారు. ప్రత్యర్థి పార్టీలను బీజేపీ, కేంద్ర సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని..ఆమె విరుచుకుపడ్డారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోెకి రాదని ఆమె అన్నారు. ఇది రాయల్ బెంగాల్ టైగర్ భూమి అని.. వారు మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుక ప్రయత్నిస్తే బీజేపీకి తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేశారని.. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మమతా బెనర్జీ ఆరోపించారు.
.