Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు.
పశ్చిమ బెంగాల్ లోని బంకురా నగరంలో నివాసం ఉండే మనోజిత్ మోండల్ అనే వ్యాపారవేత్త టాటా నానో కారుతో స్థానికంగా సెలబ్రిటీగా మారిపోయారు. తన టాటా నానో కారును సోలార్ కారుగా మార్చి వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.
Vande Bharat Express: యాక్సిడెంట్లు, రాళ్ల దాడులతో వందేభారత్ ఎక్స్ప్రెస్ వార్తల్లో నిలుస్తోంది. భారత రైల్వే, మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సెమీ హైస్పీడ్ వందేభారత్ రైలుపై ఇటీవల కాలంలో వరసగా దాడులు జరుగుతున్నాయి. కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడులు చేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్ జిల్లా ఫరక్కా సమీపంలో శనివారం అర్థరాత్రి రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు.
Married Woman : ప్రేమ, ఎప్పుడు ఎవరిపై ఏర్పడుతుందో చెప్పలేము. అంతే కాకుండా లింగభేదంతో కూడా పనిలేదనే ధోరణి ఇటీవల కాలంలో ఎక్కువవుతోంది. పెళ్లైన నెల రోజుల తర్వాత భర్తను వదిలేసి.. తన స్నేహితురాలితో వెళ్లిపోయింది ఓ యువతి.
Smuggling: గుజరాత్ తీరంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇరాన్ నుంచి అక్రమంగా వచ్చిన ఓ బోటులో డగ్స్ కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు. మొత్తం రూ. 425 కోట్ల విలువైన 61 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ ఇచ్చిన సమాచారం మేరకు ఇరాన్ పడవను కోస్ట్ గార్డ్స్ పట్టుకున్నారు.
Adenovirus: ప్రపంచదేశాల వెన్నులో వణుకు పుట్టించింది కరోనా మహమ్మారి.. కొత్త కొత్త వేరియంట్లుగా దాడి చేసింది.. ఆ తర్వాత సాధారణ పరిస్థితులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మళ్లీ జలుబు, జ్వరం.. ఇతర సమస్యలు ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.. ఇక, పశ్చిమబెంగాల్లో అడెనోవైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైంది బెంగాల్ సర్కార్.. పిల్లలందరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. చిన్నారులు భయపడాల్సిన అవసరం లేదని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. అనేక…
పశ్చిమ బెంగాల్లోని కిషన్గంజ్ ప్రాంతంలోని సరిహద్దు ఔట్పోస్టు వద్ద మహిళా కానిస్టేబుల్పై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఒక బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయబడ్డారు. అతనిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించినట్లు బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి మంగళవారం తెలిపారు.
Mamata Banerjee's Cartoon Case: త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కార్టూన్ ను ఇతరులకు ఫార్వర్డ్ చేసినందుకు జాదవ్ పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పై క్రిమినల్ కేసు నమోదు అయిన 11 ఏళ్ల తరువాత కోల్కతాలోని అలీపూర్ కోర్టు శుక్రవారం అతడిపై అభియోగాలను కొట్టేసింది.
Suvendu Adhikari slams Nobel laureate Amartya Sen: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ పై మండిపడ్డారు బీజేపీ నాయకుడు, పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి. ఇటీవల అమర్త్యసేన్ మాట్లాడుతూ.. మమతా బెనర్జీ ప్రధాని కాగలిగే సత్తా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు బెంగాల్ బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. సువేందు అధికారి ఆయనపై బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 మహమ్మారి దేశాన్ని తాకినప్పుడు అమర్త్యసేన్ ఎక్కడు ఉన్నారని.. 2021 ఎన్నికల తరువాత…