Witchcraft: చేతబడి నెపంతో ఒంటరి వృద్ధ దంపతులపై దాడి.. ఆ తర్వాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Witchcraft: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. చేతబడి చేస్తున్నారన్న నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధ దంపతులను తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో గాయాల పాలైన వారిని ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయారు. ఈ ఘటన బీర్‌భూమ్ జిల్లా అహ్మద్‌పూర్‌లోని నాపరాలో చోటుచేసుకుంది.
Read Also: Baba sitting on a Hot Griddle: ఈ బాబా చాలా హాట్ గురూ.. వేడివేడి పెనంపై కూర్చున్నా!
Also Read
పెండు హెంబ్రం, పార్వతి హెంబ్రం బీర్భూమ్ జిల్లాలోని సైథియా థానా అహ్మద్ చౌకీ పరిధిలోని నాపరా గ్రామంలో నివస్తుండేవారు. మంత్రవిద్య చేస్తున్నారనే అనుమానంతో వృద్ధ దంపతులను దారుణంగా కొట్టారు. కొట్టడంతో తీవ్రంగా గాయపడిన దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులందరినీ సియురి కోర్టులో హాజరుపరచారు. అనంతరం వారిని పోలీసు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించారు.
Read Also:Medchal : బావిలో సెక్యూరిటీగార్డ్ మృతదేహం.. చంపిందెవరంటే?
చేతబడి చేశారనే ఆరోపణలపైనే..
నాపరా గ్రామానికి చెందిన మోరల్ రుబాయి బెస్రాతో సహా కొంతమంది స్థానిక ప్రజలు పెండు, అతని భార్య చేతబడి అభ్యసిస్తున్నారని అనుమానించారు. ఈ అనుమానంతో శుక్రవారం రాత్రి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులను మోరల్ ఆధ్వర్యంలో కొట్టారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని నిన్న అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆరుగురి పేర్లు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఈరోజు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!