వేసవిలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, బీహార్‌తో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాబోయే మూడు, నాలుగు రోజులలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
శంఖు ఆకారంలో ఉన్న ఈ నిర్మాణం చూపరులను ఈ ఆడిటోరియం కట్టిపడేస్తోంది. రూ. 440 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆడిటోరియంలో అనేక విభాగాలు ఉన్నాయి. అద్భుత కట్టడంగా పేర్కొంటున్న ఈ ధన ధాన్య ఆడిటోరియంను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్ లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి భారత ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. టీఎంసీ జాతీయ పార్టీ హోదాను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం ప్రత్యామ్నాయ మార్గంపై దృష్టిపెట్టారు. ఈ విషయంలో న్యాయపరంగా ఎదుర్కోవాలని యోచిస్తోంది.
భారత్ దేశంలోనే తొలి నీటి అండర్ గ్రౌండ్ లో నడిచే మెట్రో ట్రైన్ కోత్ కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది. కోల్ కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళ్తుంది.
Extramarital affair: వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాలను పాడు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు క్షణకాలం శారీరక సుఖం కోసం భర్తలను దారుణంగా చంపేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది. అతని మృతదేహాన్ని దొరకకుండా భారీ స్కెచ్ వేసింది. ఇలాంటి నేరాలు ఎంత దాచాలనుకున్నా పోలీసులకు ఎప్పుడో అప్పుడు తెలిసిపోతుంటాయి. ఈ కేసులో కూడా నిందితులు పోలీసులకు చిక్కారు.
Anti-India agenda: భారత్ అంటేనే నిలువెల్ల విషంలో మాట్లాడుతుంటుంది ముస్లిం దేశాల కూటమి ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’. ఇప్పటికే పలుమార్లు భారత అంతర్గత విషయాలపై స్పందిస్తూ ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసింది. అయితే ఎప్పటికప్పుడు ఐఓసీ వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా రామనవమి అల్లర్లపై ఓఐసీ అర్థపర్థం లేని ఆరోపనలు చేసింది. దీంతో మరోసారి తీవ్రంగా స్పందించింది భారత్.
రామ నవమి వేడుకల్లో ఓ వ్యక్తి పిస్టల్ తో హల్ చల్ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన పశ్చిమబెంగల్ లో జరిగింది. హౌరాలో రామనవమి ఊరేగింపు సందర్భంగా 22 ఏళ్ల యువకుడిని మంగళవారం పిస్టల్‌తో పట్టుకున్న వీడియో వైరల్ కావడంతో అరెస్టు చేశారు.
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
Anurag Thakur: రామ నవమి వేడుకల్లో హౌరా, బెంగాల్ లోని ఇతర ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఈ మత ఘర్షణలపై బీజేపీ, త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ల మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇదిలా ఉంటే దుర్గాపూర్‌కు చెందిన వ్యాపారవేత్త, బిజెపి నాయకుడు రాజు ఝా, కొంతమంది సహచరులతో కలిసి కోల్‌కతాకు వెళుతుండగా, శక్తిగఢ్ ప్రాంతంలోని మిఠాయి దుకాణం వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి చంపారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ సీఎం మమతా బెనర్జీపై…