లోక్సభ ఎన్నికల అనంతరం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని పదమూడు అసెంబ్లీ స్థానాలకు జులై 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. మరి కొందరి ఎమ్మెల్యేల మరణంతో అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయ్యాయి.
Fire Accident in Kolkata: పశ్చిమ బెంగాల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం ఓ ఇంజిన్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు రంగంలోకి దిగి.. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనా స్థలంలో 5-7 ఫైర్ ఇంజన్స్ మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ఘటనతో సమీప జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మంటలు చెలరేగినప్పుడు ఫ్యాక్టరీలో ఎంత మంది కార్మికులు ఉన్నారనేది తెలియాల్సి ఉంది. Also Read: Virat…
JP Nadda: పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన దాడిపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే దీదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి నడిరోడ్డుపై అంతా చూస్తుండగా మహిళతో పాటు మరో వ్యక్తిని దారుణంగా కొడుతున్న ఘటన వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), సీఎం మమతా బెనర్జీపై విరుచుకుపడుతోంది.
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
Mamata Banerjee: కాంగ్రెస్, టీఎంసీ మధ్య మళ్లీ సయోధ్య కుదిరినట్లుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేసేందుకు స్వయంగా రంగంలోకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Sikkim Tourists : సిక్కిం పరిపాలన మంగళవారం విభాగం మంగన్ జిల్లాలోని లాచుంగ్ (Lachung ) అలాగే సమీప ప్రాంతాల నుండి రెస్క్యూ ఆపరేషన్లో రెండవ రోజు ఏకంగా 1,225 మంది పర్యాటకులను తరలించింది. గత వారం కొండచరియలు విరిగిపడటం, భారీగా వర్షం కారణంగా కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న పశ్చిమ బెంగాల్ లోని బాగ్ డోగ్రా (Bagdogra) విమానాశ్రయంలో ఆరు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నందున వాతావరణం అనుమతిస్తే కొన్ని వందల మంది…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మంగళవారం ట్విస్ట్ నెలకొంది. ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నివాసానికి రాష్ట్ర అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకున్నారు.
Bengal rail accident: కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Ashwini Vaishnaw) జూన్ 17, సోమవారం పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు రూ. 2.5 లక్షల పరిహారం ప్రకటించారు ఆయన. వారితోపాటు స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. సీల్దా నుంచి వెళ్తున్న కాంచనజంగా…